'శత్రువుకు కూడా తనలాంటి పరిస్థితి ఎదురుకావొద్దు' అని నటుడు చంటి భావోద్వేగానికి గురయ్యాడు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి నటి హిమజతో కలిసి అతను వచ్చాడు. ఈ సందర్భంగా 'అమ్మగారు చనిపోయిన విషయం పదిరోజుల వరకూ మీకు ఎవరూ చెప్పలేదట' అంటూ ఆలీ ప్రశ్నించగా చంటి కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇక నటి హిమజ కూడా తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించింది. 'మీ కెరీర్‌లో ఏదైనా ఇబ్బందులు పడ్డారా?' అని ప్రశ్నించగా, 'కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత డౌన్ పేమెంట్ కట్టి, ఈఎంఐ పద్ధతిలో కారు కొనుక్కుంటే నోటికొచ్చినట్లు మాట్లాడారు. కొన్ని మీమ్స్ నన్ను చాలా బాధించాయి. రకుల్ ప్రీత్‌కు కూడా ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి' అంటూ ఆగ్రహించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రెండుసార్లు ఉత్తమ కథానాయికగా
ఈటీవీలో ప్రసారమయ్యే 'భార్యామణి' ధారావాహిక ద్వారా బుల్లితెరపై అరంగేట్రం చేసినట్లు హిమజ తెలిపింది. సీరియల్స్‌లో నటించే క్రమంలో ఉత్తమ కథానాయికగా రెండుసార్లు ఎంపికైనట్లు చెప్పింది. ఆ తర్వాత 'నేను.. శైలజ' చిత్రంతో సినీపరిశ్రమలో అడుగుపెట్టినట్లు ఆమె వెల్లడించింది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు
ఓ వ్యక్తి చేసిన నిర్వాహకానికి తనకు ప్రభాస్ అభిమానులకు మధ్య వివాదం తలెత్తినట్లు చలాకి చంటి వెల్లడించాడు. సోషల్‌మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తే.. ఎవరో తన స్నేహితుడు చెప్పిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లు చెప్పిన విధానం తనను ఆశ్చర్యపరిచిందని చంటి తెలిపాడు. ఆ తర్వాత అతడు క్షమాపణలు చెప్పినా.. తనకు జరగాల్సిన డామేజ్ జరిపోయిందని వివరించాడు.