ETV Bharat / sitara

ఆ బాధ్యత స్వీకరిస్తానని పునీత్​కు మాటిస్తున్నా: విశాల్​

గుండెపోటుతో ఇటీవలే మరణించిన కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ ఇంకా తన కళ్లలోనే మెదులుతున్నారని అన్నారు హీరో విశాల్​. పునీత్​ లాంటి గొప్ప వ్యత్తి తాను చూడలేదని అన్నారు.

puneeth
పునీత్​
author img

By

Published : Nov 1, 2021, 9:42 AM IST

"పునీత్‌ రాజ్‌కుమార్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు" అని విశాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. 'ఎనిమి' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పునీత్‌కి నివాళులర్పించిన అనంతరం విశాల్‌ మాట్లాడారు. పునీత్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ రూపొందించిన చిత్రం ‘ఎనిమి’. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. మిని స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా పునీత్‌కి నివాళులర్పించి, ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.

ఇకపై ఆ బాధ్యత నాది: విశాల్‌

పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. మేకప్‌ ఉన్నా, మేకప్‌ తీసేసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించారు. వృద్ధాశ్రమాల్ని నడిపారు. ఇవే కాదు సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చు. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమే. చివరిగా తన కళ్లనీ దానం చేశారు. ఇప్పటి వరకూ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా నేను చదివిస్తానని పునీత్‌కు మాటిస్తున్నా. పునీత్‌ సేవా కార్యక్రమాలకి నా వంతు చేయూతనందిస్తా.

ఆర్య మాట్లాడుతూ.. "పునీత్‌ సర్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్‌ యూ సర్‌" అంటూ ఎమోషన్‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆనంద్‌ శంకర్‌, కథానాయిక మృణాళిని రవి, మమతా మోహన్‌ దాస్‌, నిర్మాత వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Punith rajkumar death: 10 మంది పునీత్ ఫ్యాన్స్ మృతి, ఒకరు ఆస్పత్రిలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.