ETV Bharat / sitara

నేను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే: విజయ్​ దేవరకొండ

కెరీర్‌ ప్రారంభంలో(vijay devarakonda brother movie) తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించానని అన్నారు హీరో విజయ్​ దేవరకొండ(vijay devarakonda updates). తన తమ్ముడు ఆనంద్​ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం'(pushpaka vimanam 2021 movie) సినిమాను విజయవంతం చేయాలని అభిమానులను కోరారు. ఇంకా ఈ మూవీ గురించి పలు విశేషాలను తెలిపారు.

vijay
విజయ్​ దేవరకొండ
author img

By

Published : Nov 8, 2021, 6:33 AM IST

Updated : Nov 8, 2021, 9:23 AM IST

'కొత్తవారిని ప్రోత్సహించాలనే(vijay devarakonda brother movie) ఉద్దేశంతో నిర్మాతగా ముందడుగేశా. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది' అని యువ నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు(vijay devarakonda updates). ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం(అక్టోబర్​ 7) విశాఖపట్నంలో 'పుష్పక విమానం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమం జరిగింది. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ కథానాయకుడిగా దర్శకుడు దామోదర రూపొందించిన చిత్రమిది(pushpaka vimanam 2021 movie). గీత్‌ సైని, శాన్వి మేఘన కథానాయికలు. గోవర్ధనరావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతలు. విజయ్‌ దేవరకొండ సమర్పకులు. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వేడుకను ఉద్దేశించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ(vijaydevarkonda movie updates).. "ఈ చిత్ర విడుదల సమయంలో నేను ఇక్కడ ఉండను. 'లైగర్‌' చిత్ర షూటింగ్‌ కోసం యూఎస్‌ వెళ్తున్నా. నేను నిర్మించిన ఈ సినిమాను మీరే చూసుకోవాలి. విజయవంతం చేయాలి. కెరీర్‌ ప్రారంభంలో నేను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించా. కానీ, నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. నటుడిగా సినిమా కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం, సినిమాను ప్రచారం చేసుకోవడం.. ఇలా నా పని నాకే సరిపోతుంది. అలాంటిది ఇంకో సినిమాను నిర్మించి, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. ఒక్కోసారి ఇది మనకు అవసరమా అనిపిస్తుంటుంది. ఆత్మవిశ్వాసం, మీరు నాపై పెట్టిన నమ్మకంతో ముందుకెళ్తా. ఐదారేళ్ల క్రితం నేనెవరో మా గల్లీ వారికే తెలియదు. ఇప్పుడిలా మీ అందరి ముందుకొచ్చి నటుడిగా, నిర్మాతగా మాట్లాడగలుగుతున్నా. ఈ ప్రయాణాన్ని అసలు ఊహించలేదు. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈ చిత్ర దర్శకుడితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. తనలో మంచి రచయిత ఉన్నాడు. ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆనంద్‌ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కథానాయికలిద్దరూ చాలా చక్కగా నటించారు. నవంబరు 12న విడుదలవుతున్న కార్తికేయ 'రాజా విక్రమార్క' చిత్రం విజయంవంతం కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ(anand deverakonda pushpaka vimana).. "ఈ సినిమాలో హీరోయిజం ఉండదు. సుందర్‌ అనే పాత్రలో నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపిస్తా. ఇది కామెడీ థ్రిల్లర్‌ సినిమా. పెళ్లితో ముడిపడి ఉంటుంది. సునీల్‌, హర్ష వర్థన్‌, నరేశ్‌ వంటి సీనియర్‌ నటుల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. మా నాన్న నటుడవ్వాలనే లక్ష్యంతో 35 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆయన యాక్టర్‌ కాలేకపోయారు. అన్నయ్య (విజయ్‌), నేనూ నటులయ్యాం. ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు" అని అన్నారు.

ఇదీ చూడండి: ముంబయి రోడ్లపై దర్శకుడు పూరీకి విచిత్ర అనుభవం

Last Updated : Nov 8, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.