కరోనాను అరికట్టటంలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విరాళాలు అందించారు. ఈ జాబితాలో తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చేరారు. దక్షిణాది రాష్ట్రాలకు తన వంతు సాయంగా రూ.1.3 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
విజయ్ ప్రకటించిన విరాళాల జాబితా
- ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు
- తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు
- దక్షిణాది సినీ కార్మికుల ఫెడరేషన్(ఫెఫ్సీ)కి రూ.25 లక్షలు
- కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక ముఖ్యమంత్రుల సహాయనిధికి తలో రూ.5 లక్షలు
దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు విజయ్ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి కుమారుడు జాన్సన్.. ప్రస్తుతం కెనడాలో చిక్కుకుపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.