సినిమాను వినోదంగా భావించే తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమాను బతికిస్తారని యువ కథానాయకుడు తేజ సజ్జా ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా రెండో దశ కారణంగా మూతపడిన థియేటర్లు ఈ నెల 30 నుంచి మళ్లీ సందడిగా మారబోతున్నాయని తేజ తెలిపాడు.
తన తాజా చిత్రం 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' ఈ నెల 30న విడుదల అవుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన తేజ.. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో 94వ చిత్రంగా తన సినిమా ఉండటం ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నాడు. 'ఇష్క్' మలయాళ చిత్రానికి రీమేకే అయినా ఎక్కడా ప్రేక్షకుల్ని నిరాశ పరచదని తేజ వెల్లడించాడు. అలాగే తన తదుపరి చిత్రం 'హనుమ్యాన్' కోసం భారీగా కసరత్తలు చేస్తున్నట్లు తేజ వివరించాడు.