తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'జై భీమ్'(jaibhim movie controversy) ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమా ఓ వైపు ప్రశంసలను పొందుతూనే విమర్శలను కూడా అందుకుంటోంది. ఈ క్రమంలోనే సినిమా విషయంలో హీరో సూర్యకు బెదరింపులు వచ్చాయి(surya latest news). దీంతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ జరిగింది
'జైభీమ్' సినిమాలో తమ వర్గాన్ని కించపరిచారంటూ వన్నియర్ సంఘం చిత్రబృందానికి లీగల్ నోటీసులను పంపింది. రూ.5కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా సూర్యను ఎవరైనా కొడితే లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పీఎంకే జిల్లా కార్యదర్శి పళని సామి. ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా సంచలనం రేపింది. దీంతో సూర్యకు పలువురు ప్రముఖులు, అభిమానులు అండగా నిలుస్తున్నారు. ఆయనకు మద్దతుగా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతూ 'వి స్టాండ్ విత్ సూర్య' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పళని సామిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: సూపర్‌హిట్ 'జై భీమ్'పై ఇన్ని వివాదాలు ఎందుకు?