Global Oscars award: 'జై భీమ్' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలోని సన్నివేశాలకు ప్రఖ్యాత ఆస్కార్ యూట్యూబ్‌లో చోటు కూడా దక్కింది. ఈ సినిమా నిర్మాతలైన సూర్య-జ్యోతికలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.
'జై భీమ్' లాంటి నిజజీవిత కథను అద్భుతంగా తెరకెక్కించిన నిర్మాతలకు 'MEATF కాంగ్రెస్‌నల్ మెడల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ 2021' పురస్కారం దక్కింది. ఇందులో భాగంగా అమెరికాలోని ఇల్లినాయిస్లో ఫిబ్రవరి 19న జరిగే వేడుకలో సూర్య-జ్యోతిక.. గ్లోబల్ ఆస్కార్ అవార్డులు అందుకోనున్నారు. ఈ క్రమంలోనే 'జై భీమ్' చిత్రబృందం మొత్తాన్ని ఈ వేడుకకు ఆహ్వానించారు.
![Suriya and his wife Jyothika-- Udhyanidhi Stalin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/udh_2001newsroom_1642662827_354.jpg)
తమిళ నటుడు, డీఎమ్‌కే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్.. 'ద ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2021'గా నిలిచినట్లు గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 19న జరిగే కార్కక్రమంలో స్టాలిన్‌కు కూడా గ్లోబల్ ఆస్కార్ అవార్డు అందజేయనున్నారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు.
ఇవీ చదవండి: