శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న 'తిప్పరా మీసం' సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో అతని లుక్ చాలా వినూత్నంగా ఉండి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.