పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడి జోరు మాత్రం మాములుగా లేదు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ, అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే 'పింక్' తెలుగు రీమేక్, క్రిష్ దర్శకత్వంలో, హరీశ్ శంకర్‌తో కలిసి పవన్ పనిచేస్తున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయితే పవన్ వీటిలోనే కాకుండా మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
అగ్ర దర్శకులతో పవర్‌స్టార్?
పవన్ చేయనున్న ఆ మిగతా రెండు సినిమాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించనున్నాయట. హారిక.. సంస్థలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించనుండగా, ఎస్ఆర్టీ సంస్థలో పవర్‌స్టార్‌తో ఓ కొత్త దర్శకుడు పనిచేయనున్నాడట.
ఇవే కాకుండా ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్.. పవన్ కోసం ఓ కథను సిద్ధం చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హీరో వేగం చూస్తుంటే, మరో రెండేళ్లు వరకు అతడి అభిమానులకు పండగే పండగ.
ఇదీ చదవండి: ఆస్కార్‌కు నామినేట్ అవ్వటం సంతోషమే.. కానీ!