ETV Bharat / sitara

పవన్‌ వ్యాఖ్యలపై నాగబాబు కామెంట్‌..! - నాగబాబు వార్తలు

'రిపబ్లిక్'(Republic Movie Release Date) ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పవర్​స్టార్ పవన్​కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగబాబు(Pawan Kalyan Brother) సమర్థించారు. ఈ మేరకు ఇస్టా వేదికగా పలువురు నెటిజన్​లు అడిగిన ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

actor nagababu
నాగబాబు
author img

By

Published : Sep 30, 2021, 9:19 AM IST

సినిమా టిక్కెట్​ల వ్యవహరంపై తన సోదరుడు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగబాబు(Pawan Kalyan Brother) సమర్థించారు. 'రిపబ్లిక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన సోదరుడు చేసిన వ్యాఖ్యలు అదరగొట్టేలా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా వేదికగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నాగబాబు(Pawan Kalyan Brother) తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సెటైరికల్‌గా స్పందించారు. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానాలేమిటంటే..

మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?

నాకు ఇంట్రస్ట్‌ పోయింది.

సాయిధరమ్‌తేజ్‌ ఇప్పుడు ఎలా ఉన్నారు?

సాయితేజ్‌(Sai Dharam Tej Accident News) ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. త్వరలోనే మన ముందుకు వస్తాడు.

పవన్‌కల్యాణ్‌ గురించి ఏమైనా మాట్లాడండి?

పవన్‌కల్యాణ్‌ స్టార్‌హీరో. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన నిజాయతీపరుడు అనే అర్థం వచ్చేలా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళీ(Posani Krishna Murali Latest News) చెప్పిన ఓ వీడియో క్లిప్‌ని నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగబాబు షేర్‌ చేశారు.

"ఈరోజు పవన్‌కల్యాణ్‌ ఒకవేళ సినిమా హీరోగా పనిచేస్తాను అంటే నేను ఆయనకి బ్లాంక్‌ చెక్‌ ఇస్తా. ఎన్నిసున్నాలైనా పెట్టుకోవచ్చు. రూ.40 కోట్లయినా నేను పవన్‌కల్యాణ్‌కి ఇస్తా. ఎందుకంటే ఆయన అంత డిమాండ్‌ ఉన్న హీరో. వన్‌ ఆఫ్‌ ది టాప్‌ హీరో ఇన్‌ ఇండియా నాట్ ఓన్లీ ఇన్‌ తెలుగు స్టేట్స్‌. రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్ల కోసం ఆయన పిచ్చి పిచ్చి పనులు చేయడు. నాకు తెలుసు"

- వీడియోలో పోసాని మాటలు.

అయ్యయ్యో వద్దమ్మా.. ఏదైనా అడగండి అని అంటారు? కానీ రిప్లై మాత్రం ఇవ్వరు?

అయ్యయ్యో ఇస్తానమ్మా.. ప్రశ్నలు ఎక్కువ కావడం వల్ల ఆలస్యం కావొచ్చు. కానీ రిప్లై మాత్రం తప్పకుండా ఇస్తానమ్మా.. సుఖీభవా.. సుఖీభవా.

సర్‌.. ఆంధ్రప్రదేశ్‌ సినిమా టిక్కెట్ల వ్యవహరంపై మీ అభిప్రాయమేమిటి?

'విక్రమార్కుడు'లో.. రవితేజ-బ్రహ్మానందం దొంగిలించిన డబ్బును పంచుకునేటప్పుడు వచ్చే డైలాగ్‌లు సమాధానం.

మీలో మాకు మంచి మీమర్‌ కనిపిస్తున్నారు?

ఏమో సర్‌ నాకు కనపడదు (నవ్వులు)

మీరు జీవితంలో బాగా ఫాలో అయ్యే రూల్స్‌ ఏమిటి?

నా భార్య పెట్టిన రూల్స్

సొసైటీ ఎప్పుడు డెవలప్‌ అవుతుంది?

అది తెలిసిన వెంటనే ఫస్ట్‌ నీకే చెబుతాను.

పేర్ని నాని గురించి మీరేమనుకుంటున్నారు?

ఆయన మహానటుడనే ఉద్దేశంతో.. (నేను ఏం చెప్పాలి.. భారతదేశంలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు వస్తాయి. ఆస్కార్‌కి కూడా వెళ్లే అవకాశం ఉంది. అంటూ 'గుండెల్లో గోదారి' ఆడియో ఫంక్షన్‌లో మోహన్‌బాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను సమాధానంగా చెప్పారు)

'రిపబ్లిక్‌'(Republic Movie Release Date) సినిమా ఫంక్షన్‌లో పవన్‌ వ్యాఖ్యలపై మీ స్పందన?

అదిరింది. ఒక శివమణి జాస్‌ కొట్టినట్టు.. ఒక జాకీర్‌ హుస్సేన్‌ తబల కొట్టినట్టు.. శంకర్‌ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ ఇచ్చినట్టు ఉంది.

ప్రభాస్‌ గురించి.. ?

ఆయన అందగాడు.. స్మార్ట్‌

ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన పాట?

బుల్లెట్‌ బండి(Bullet Bandi Song)

జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి?

న్యూస్‌ ఛానల్స్‌ చూడడం మానేయండి

అన్నయ్య.. చిరు-ఏఎన్నార్‌ ఉన్న ఫొటో ఏదైనా షేర్‌ చేయగలరు?

ఫొటో లేదు కానీ.. వీడియో ఉంది..!

ఇదీ చదవండి: పవన్​ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.