ETV Bharat / sitara

లాక్​డౌన్​ వేళ చెఫ్​గా మారిన స్టార్ ​నటి - పవన్​కల్యాణ్​ తాజా వార్తలు

లాక్​డౌన్​ కారణంగా 'అత్తారింటికి దారేది' ఫేం నదియా.. ఇంట్లో రకరకాల వంటలు వండుతూ గడుపుతోంది. తాజాగా 'ఇటాలియన్​ లాసాగ్నే పాస్తా' అనే వంటకాన్ని తయారుచేసి ఇన్​స్టాలో వీడియో పోస్ట్​ చేసింది.

Actor Nadiya Cooking new food item Italian Lasagney during lockdowni time in house
'ఇటాలియన్‌ లాసాగ్నే పాస్తా'... ఇదొక 'ఇటాలియన్‌ లాసాగ్నే పాస్తా'... ఇదొక రహస్య పదార్థంరహస్య పదార్థం
author img

By

Published : Apr 23, 2020, 5:23 AM IST

'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ మేనత్తగా నటించి అలరించింది అలనాటి నటి నదియా. ఈ సినిమాతో టాలీవుడ్​లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ రకరకాల వంటలు వండుతోంది. ఇటాలియన్‌ లాసాగ్నే పాస్తా అనే వంటకాన్ని తయారు చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దానికి "ఇదొక రహస్య పదార్థం యొక్క సృజనాత్మకత.. క్వారెంటైన్‌ కుకింగ్‌" అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించింది.

తెలుగులో మొదటిసారి నదియా.. సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు రమేష్‌బాబుతో కలిసి 1988లో "బజార్‌ రౌడీ" చిత్రంలో నటించింది. ఆ తరువాత 'వింతదొంగలు', 'ఓ తండ్రి కొడుకు' సినిమాల్లో నటించింది. మళ్లీ 2013 నుంచి తెలుగులో 'మిర్చి', 'అత్తారింటికి దారేది', 'బ్రూస్‌ లీ ది ఫైటర్‌', 'నా పేరు శివ'లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ కథానాయికగా వస్తోన్న 'మిస్‌ ఇండియా', వరుణ్‌ తేజ్‌ 'బాక్సర్‌' చిత్రంలో నటిస్తోంది.

లాక్​డౌన్​ కారణంగా సెలబ్రిటీలంతా తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతూ, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి : మహిళా రిపోర్టర్​కు స్టార్​హీరో క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.