సినీ నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు.. అభిమానుల సమక్షంలో శుక్రవారం ఫిలింనగర్‌లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చెందిన సినీ కార్మికుడు, మోహన్ బాబు అభిమాని వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సుమారు 200 మంది కోలాటం కళాకారులతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది.
మోహన్‌బాబు నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ వరకు కోలాటం నిర్వహించారు. అనంతరం ఫిలిం ఛాంబర్‌లో 100 కేజీల కేక్‌ను కట్ చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. భారీగా చెల్లని ఓట్లు..!