ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ (Javed Akhtar latest news) వేసిన పరువు నష్టం కేసు విచారణ కోసం ముంబయిలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు నటి కంగనా రనౌత్(Kangana Ranaut news update). తదుపరి విచారణ అక్టోబరు 1న జరగాల్సి ఉండగా.. గడవు పెంచాలన్న రనౌత్ తరఫు న్యాయవాది అభ్యర్థనతో నవంబరు 15కు వాయిదా వేసింది ధర్మాసనం.
![Actor Kangana Ranaut](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13116488_e_tdyloviaq_ff0.jpg)
గతేడాది జులై 19న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు, జావేద్ అక్తర్‌కు ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విషయమై నవంబరు 3న ఆమెపై పరువు నష్టం దావా వేశారు జావేద్ అక్తర్. ఈ కేసులో భాగంగానే గతంలో కంగనకు పలుమార్లు సమన్లు ఇచ్చిన న్యాయస్థానం.. బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది.
ఇవీ చూడండి: