kamalhassan corona: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు(kamalhassan health condition).
తన తండ్రి కమల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నటి శ్రుతిహాసన్. కమల్ కోలుకుంటున్నట్లు చెప్పిన ఆమె.. త్వరలోనే అందరి ముందుకు రావాలని ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
నవంబరు 22న తనకు కరోనా సోకినట్లు ట్వీట్ చేశారు కమల్. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని చెప్పారు(kamal haasan corona).
ఇదీ చూడండి: shruti haasan bigg boss: బిగ్‌బాస్ హోస్ట్‌గా శ్రుతిహాసన్?