కరోనా సెకండ్ వేవ్ కారణంగా టాలీవుడ్లో అనేక చిత్రాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మే నెలలో రానున్న అగ్రకథానాయకుల సినిమాలూ రిలీజ్ అవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' సినిమా వాయిదా పడే అవకాశం ఉందని చిత్రసీమలో టాక్ నడుస్తోంది.
'ఆచార్య' చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. కరోనా సంక్షోభం కారణంగా సినిమా విడుదలను జూన్‌కు వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో.. ప్రస్తుతం రామ్‌చరణ్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అది పూర్తవ్వగానే ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఇదీ చూడండి: బాలయ్య సినిమా కోసం వందేళ్లు వెనక్కి!