కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో 'ఆచార్య' షూటింగ్ ఇప్పటికే ఆగిపోయింది. అయినా సరే సోషల్ మీడియాలోని చర్చల్లో ప్రస్తుతం నిలిచింది. ఇందులో 'నీలాంబరి' అంటూ సాగే పాట లీక్ కావడమే ఇందుకు కారణం.
'ఆచార్య'లో రామ్చరణ్ పాత్ర పేరు సిద్ధ, పూజా హెగ్డే పాత్ర పేరు నీలాంబరి.. వీరిద్దరి మధ్యే ఈ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి మెలోడీగా సాగుతున్న ఈ గీతం.. మెగా అభిమానుల్ని అలరిస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల 13న సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను మూసివేశారు. దీంతో 'ఆచార్య', ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందో అనే సందిగ్ధత ఏర్పడింది.
ఇది చదవండి: తమిళ 'రంగస్థలం' విడుదలకు బ్రేక్