ETV Bharat / sitara

అవకాశం వచ్చినా ఆమిర్​తో నటించను: అభిషేక్ బచ్చన్

author img

By

Published : Jun 26, 2020, 1:44 PM IST

హీరో ఆమిర్​ఖాన్ దర్శకత్వంలో తనకు నటించాలని ఉందని అభిషేక్ బచ్చన్ చెప్పారు. ఒకవేళ అతడితో కలిసి నటించే అవకాశమొస్తే తిరస్కరిస్తానని అన్నారు.

అవకాశం వచ్చినా ఆమిర్​తో నటించను: అభిషేక్ బచ్చన్
అభిషేక్ ఆమిర్

తనకు అవకాశమొచ్చినా సరే సూపర్​స్టార్ ఆమిర్​ఖాన్​తో నటించని బాలీవుడ్​ నటుడు అభిషేక్ బచ్చన్ చెప్పారు. ఏంటి వీరిద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగింది? లేకపోతే మనస్పర్థలు వచ్చాయా? అని ఆలోచిస్తున్నారా. దీని గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్.. నటించకపోవడానికి గల కారణాల్ని వెల్లడించారు.

"ఆమిర్​ఖాన్​తో తెరను పంచుకునే అదృష్టం 'ధూమ్-3'తో దక్కింది. ఒకవేళ ఇప్పుడు అతడి పక్కన నటించే అవకాశమొస్తే వద్దంటాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆమిర్ దర్శకత్వంలో నటించాలని ఉంది. ఒకవేళ మీరు(ఆమిర్) దీనిని చదివితే నా విజ్ఞప్తి గురించి ఓసారి ఆలోచించండి" -అభిషేక్ బచ్చన్, బాలీవుడ్ ప్రముఖ నటుడు

'ధూమ్-3' చిత్రీకరణ సందర్భంగా చికాగోలోని అమ్యూజ్​మెంట్​ పార్క్​లో ఆమిర్​తో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు అభిషేక్. ప్రస్తుతం 'లూడో', 'ద బిగ్ బుల్', 'బాబ్ విశ్వాస్' సినిమాల్లో ఇతడు నటిస్తున్నారు. దీనితో పాటే 'బ్రీత్' వెబ్​ సిరీస్​ రెండో సీజన్​లోనూ ప్రధాన పాత్ర పోషించారు. త్వరలో అమెజాన్ ప్రైమ్​లో విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.