అభిషేక్ బచ్చన్ హీరోగా స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ది బిగ్ బుల్'. కూకీ గులాటీ దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో అభిషేక్ బచ్చన్ మెహతా పాత్రలో కనిపించనున్నాడు. భారతదేశంలోని స్టాక్ బ్రోకర్‌గా హర్షద్ చేసిన ఆర్థిక నేరాల గురించి తెలియని వారు ఉండరు. 1990 నుంచి 2000 మధ్యలో స్టాక్ మార్కెట్లో జరిగిన ఆర్థిక అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమాకు అజయ్ దేవ్‌గణ్, ఆనంద్ పండిట్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలియానా, నిఖిత దత్తా, రామ్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రంతో పాటు అభిషేక్ బచ్చన్ అనురాగ్ బసు దర్శకత్వంలో 'లుడో'లో నటిస్తున్నాడు. ఏప్రిల్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు 'బ్రీత్' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనున్నాడీ హీరో.
ఇదీ చదవండి: కార్తికేయ మాస్ లుక్.. రవితేజ ఫైర్ లుక్