సోనమ్‌కపూర్,అనిల్ కపూర్ నటించిన "ఏక్ లడఖా తో ఐసా లగా" సినిమా.. ఆస్కార్ లైబ్రరీకి ఎంపికైంది. ఈ వార్తపై సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేసింది.
- స్వలింగ సంపర్కులు కలిసి జీవిస్తే..సమాజంతో, కుటుంబంతో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో అనే వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకం. ఇది నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమా కూడా. ఇది ఆస్కార్ లైబ్రరీకి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాను ఇంతగా ప్రేమించిన అభిమానులకు కృతజ్ఞతలు--సోనమ్ కపూర్.
ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో రాజ్ కుమార్ రావ్, జూహీ చావ్లా నటించారు.