ETV Bharat / sitara

'విక్రమ్​వేద' రీమేక్​ వచ్చేది 2022లోనే!

మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం 'విక్రమ్​వేద'. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్​లో తెరకెక్కించేందుకు ఆమిర్ ఖాన్ సిద్ధమయ్యారు. కానీ కరోనా కారణంగా ఈ పనులు వాయిదా పడ్డాయి.

Aamir khan want to remake Vikram Vedha in 2022
ఆమిర్
author img

By

Published : Jun 26, 2020, 4:11 PM IST

'విక్రమ్‌వేద'.. 2017లో విడుదలైన ఈ తమిళ చిత్రం ఆమిర్‌ ఖాన్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. మాధవన్‌, విజయ్‌ సేతుపతి నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దీన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని ఆమిర్‌ భావించారు. ప్రస్తుతం 'లాల్‌సింగ్‌ చద్దా' తర్వాత దీన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020 క్రిస్మస్‌కు 'లాల్‌సింగ్‌ చద్దా' విడుదలయ్యేది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయింది. 40శాతం చిత్రీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో 2021 క్రిస్మస్‌ వరకూ దీన్ని వాయిదా వేయాలని, ఆ తర్వాతే 'విక్రమ్‌వేద' చేయాలని భావిస్తున్నారు ఆమిర్‌ ఖాన్‌. ఈ చిత్రంలోని మరో ముఖ్యమైన పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.