ETV Bharat / sitara

కొవిడ్​తో తెలిసొచ్చింది.. ఆ సంబంధాలపై దృష్టి పెడతా: ఆమిర్​ఖాన్ - లాల్​ సింగ్ చద్దా

Aamir Khan: కొవిడ్​ లాక్​డౌన్​తో ఇంట్లో ఉన్నప్పుడు చాలా విషయాలు తెలిసొచ్చాయని చెప్పారు బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్​ఖాన్. జీవితం ఎంత సున్నితమైనదో అర్థం చేసుకున్నట్లు వివరించారు. తన 57వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆమిర్.

Aamir Khan
ఆమిర్ ఖాన్
author img

By

Published : Mar 14, 2022, 9:44 PM IST

Aamir Khan: కొవిడ్​ సంక్షోభంతో జీవితం ఎంత సున్నితమైనదో అర్థమైందని చెప్పారు బాలీవుడ్​ సూపర్​స్టార్​ ఆమిర్​ఖాన్. కరోనా సమయంలో చేసుకున్న ఆత్మపరిశీలన.. తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. ఇకపై మానవ సంబంధాలపై దృష్టి సారిస్తానని అన్నారు. నేడు (మార్చి 14) ఆయన 57వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

"కొవిడ్​ కారణంగా ఇంటి వద్ద ఉన్నప్పుడు అత్మపరిశీలన చేసుకోవడానికి చాలా సమయం దొరికింది. ఈ సమయంలో జీవితం, సమయం.. ప్రాధాన్యం గురించి చాలా తెలుసుకున్నాను. అందరం ఏదో ఒక రోజు చనిపోతాం. ఎప్పుడో తెలియదు కానీ అంతిమంగా జరిగేది అదే. కాబట్టి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. మనందరం జీవితాన్ని నిర్లక్ష్యంగా గడుపుతాం. నేనూ అలానే చేశా. కానీ ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక నుంచి ఆత్మపరిశీలన చేసుకోవడానికి సంకోంచించను. ఒకవేళ నాలో తప్పు ఉందని తెలిస్తే దానిని అర్థం చేసుకొని సరిచేసుకుంటాను. నన్ను ప్రేమించేవాళ్లకు, నేను ప్రేమించేవాళ్లకు, అభిమానులందరికీ సమయమిస్తాను. ప్రతి సంబంధాన్ని మెరుగుపరచుకోవడమే నా లక్ష్యం"

-ఆమిర్ ఖాన్​, బాలీవుడ్​ నటులు

ఆమిర్​ ఖాన్​ ఏటా తన పుట్టినరోజు వేడుకలను మీడియాతో కలిసి చేసుకుంటారు. బాంద్రాలోని తన ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కొవిడ్​ సమయం కావడం వల్ల ఈ సారి హోటల్​లో నిర్వహించారు.

ఆమిర్​ ఖాన్​ నటించిన కొత్త చిత్రం 'లాల్​ సింగ్ చద్దా' ఆగస్టు 11న విడుదల కానుంది. 2018లో విడుదలైన 'థగ్స్​ ఆఫ్​ హిందుస్తాన్​' చిత్రంలో ఆమిర్​ చివరిసారిగా కనిపించారు.

ఇదీ చదవండి: ట్యాక్స్ ఫ్రీ.. ఉద్యోగులకు లీవ్.. టాప్​ రేటింగ్స్​.. 'కశ్మీర్​ ఫైల్స్' ఎందుకింత స్పెషల్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.