బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం స్వయంగా వెల్లడించారు. తనకు విషయాల్ని నిర్మాణ సంస్థ ద్వారా వెల్లడిస్తారని తెలిపారు.
- — Aamir Khan (@aamir_khan) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Aamir Khan (@aamir_khan) March 15, 2021
">— Aamir Khan (@aamir_khan) March 15, 2021
ఆదివారం 56వ పుట్టినరోజు జరుపుకొన్న ఆమిర్.. శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఇదే తన చివరి పోస్ట్ అని వెల్లడించారు.
'లగాన్', 'తారే జమీన్ పర్', 'దంగల్' లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్.. ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా'లో నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో చిత్రం విడుదల కానుంది.