ETV Bharat / sitara

AAMIR KHAN DIVORCE: 'మేం సంతోషంగానే ఉన్నాం' - aamir khan fatima sana shaikh dangal

తాము దంపతులుగా విడిపోయినప్పటికీ, ఇప్పటికీ కుటుంబంలో భాగంగానే ఉన్నామని ఆమిర్​ఖాన్-కిరణ్​రావు వెల్లడించారు. విడాకులు తీసుకున్న అనంతరం కెమెరా ముందుకొచ్చిన ఈ ఇద్దరు.. జంటగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Aamir Khan on divorce with Kiran Rao
ఆమిర్​ఖాన్ డైవోర్స్
author img

By

Published : Jul 4, 2021, 7:13 PM IST

.

బాలీవుడ్‌ జంట ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ శనివారం ప్రకటించారు. దీనిపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలామంది అభిమానులు మాత్రం విచారం వ్యక్తం చేశారు. దీంతో ఈ బాలీవుడ్‌ జంట మరోసారి కెమెరా ముందుకు వచ్చి తమ విడాకులపై మాట్లాడారు. తమ విడాకుల వార్తతో చాలామంది బాధపడి ఉండవచ్చు. తాము దంపతులుగా విడిపోయినా ఇప్పటికీ ఒకే కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. బంధాలు మారినా ఒకరికోసం ఒకరం అండగా నిలబడి ఉంటామని చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరూ వేరే విధంగా ఆలోచించవద్దని వారు ఆ వీడియోలో కోరారు.

ఎప్పటి నుంచో విడిపోదామనుకుంటున్న ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావు దంపతులు తమ విడాకుల విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. జులై 3న విడాకుల విషయాన్ని ప్రకటిస్తూ.. 'తాము తీసుకున్న ఈ నిర్ణయం ముగింపు కాదని.. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం' అని పేర్కొన్నారు. భార్యభర్తలుగా విడిపోయినా తమ పిల్లలకు తల్లిదండ్రులుగా కొనసాగుతామని చెప్పారు. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కిరణ్‌రావును ఆమిర్‌ఖాన్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమిర్‌ 'లగాన్‌' చిత్రానికి కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005 డిసెంబర్‌ 28 వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 2011లో ఆజాద్‌ అనే బాబుకు సరోగసి పద్ధతిలో ఈ దంపతులు జన్మనిచ్చారు.

ఇది చదవండి: వివాహ బంధానికి ఆమిర్ ఖాన్ దంపతుల గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.