బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఇటీవలే టర్కీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడి సతీమణి ఎమిన్ ఎర్డోగాన్‌ను వారి అధికార నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. భారత్‌లో తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలపై చర్చించేందుకే ఆమెతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఫొటోలు ఎమినో పోస్ట్ చేశారు. ఆమిర్‌తో మాట్లాడటం తనకెంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
-
I had the great pleasure of meeting @aamir_khan, the world-renowned Indian actor, filmmaker, and director, in Istanbul. I was happy to learn that Aamir decided to wrap up the shooting of his latest movie ‘Laal Singh Chaddha’ in different parts of Turkey. I look forward to it! pic.twitter.com/3rSCMmAOMW
— Emine Erdoğan (@EmineErdogan) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I had the great pleasure of meeting @aamir_khan, the world-renowned Indian actor, filmmaker, and director, in Istanbul. I was happy to learn that Aamir decided to wrap up the shooting of his latest movie ‘Laal Singh Chaddha’ in different parts of Turkey. I look forward to it! pic.twitter.com/3rSCMmAOMW
— Emine Erdoğan (@EmineErdogan) August 15, 2020I had the great pleasure of meeting @aamir_khan, the world-renowned Indian actor, filmmaker, and director, in Istanbul. I was happy to learn that Aamir decided to wrap up the shooting of his latest movie ‘Laal Singh Chaddha’ in different parts of Turkey. I look forward to it! pic.twitter.com/3rSCMmAOMW
— Emine Erdoğan (@EmineErdogan) August 15, 2020
"ప్రపంచ గుర్తింపు పొందిన నటుడు, నిర్మాత, దర్శకుడు ఆమిర్‌ఖాన్‌తో భేటీ కావడం చాలా ఆనందంగా ఉంది. తన కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్‌ను టర్కీలోని వివిధ ప్రాంతాల్లో తీయాలనుకుంటున్నారు. ఇది చాలా సంతోషాన్నిచ్చింది. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"
- ఎమిన్ ఎర్డోగాన్, టర్కీ ప్రథమ మహిళ
1994లో వచ్చిన 'ఫారెస్ట్ గంప్'కు హిందీ రీమేక్ ఈ సినిమా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్ హీరోయిన్లు. ఈ ఏడాది డిసెంబరు 25న సినిమాను తీసుకురావాలనుకున్నారు కానీ, లాక్డౌన్ వల్ల అదికాస్త వాయిదా పడింది.