ETV Bharat / sitara

ఆమిర్​ అలా చేయకపోయుంటే ఆ నటుడు బతికేవారా? - లగాన్

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్​ గత నెలలో కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతిచెందారు. అయితే ఆయన మృతికి, అగ్ర నటుడు ఆమిర్ ఖాన్​​కు సంబంధం ఉందంటున్నారు అనుపమ్​ సోదరుడు అనురాగ్.

Aamir Khan
ఆమిర్ ఖాన్
author img

By

Published : Aug 13, 2021, 2:51 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్​ ఆమిర్​ ఖాన్​పై సంచలన ఆరోపణలు చేశారు నటుడు అనుపమ్​ శ్యామ్ ఓజా సోదరుడు అనురాగ్ శ్యామ్. తమకు సహాయం చేస్తానని చెప్పిన ఆమిర్​.. ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Aamir Khan
అనుపమ్ శ్యామ్​

ఆమిర్ మాట తప్పారా?

కిడ్నీ వ్యాధి సహా ఇతర అవయవాలు విఫలమై ఈ నెల 8న ముంబయిలోని ఓ ఆస్పత్రిలో అనుపమ్ మృతి చెందారు. అయితే అతడికి డయాలసిస్​ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఆమిర్​ గతంలో హామీ ఇచ్చినట్లు అనురాగ్ తెలిపారు.

"అనారోగ్యంతో మా అమ్మ గత నెలలో మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో ఉన్న ఆమెను చూడటానికి వెళ్లలేకపోయినందుకు అనుపమ్ ఎంతో బాధపడేవారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో డయాలసిస్​ కేంద్రం లేదు. కాబట్టి, అక్కడికి వెళ్తే ఆయన ప్రాణాలకే ముప్పు. ఈ నేపథ్యంలో ఆమిర్​ సహాయం కోరగా.. ప్రతాప్​గఢ్​లో డయాలసిస్​ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ అప్పటి నుంచి మేము చేసే ఫోన్​లకు స్పందించడం మానేశారు."

-అనురాగ్ శ్యామ్, అనుపమ్ సోదరుడు

మన్​కీ ఆవాజ్: ప్రతిజ్ఞ అనే కార్యక్రమం ద్వారా అనుపమ్ చాలా పాపులర్. అదే కాక స్లమ్​డాగ్ మిలీనియర్, బండిట్​ క్వీన్, దిల్సే, ఆమిర్​ 'లగాన్' చిత్రం సహా అనేక చిత్రాల్లో నటించారు అనుపమ్.

ఇదీ చూడండి: అభిమానులూ సిద్ధం కండి.. పవర్​స్టార్​ నుంచి భారీ అప్​డేట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.