Aadhi Pinishetty Marriage: 'గుండెల్లో గోదారి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన 'సరైనోడు', 'నిన్ను కోరి', 'రంగస్థలం' 'నీవెవరో', 'యూ టర్న్', 'గుడ్ లక్ సఖి' వంటి చిత్రాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఆయన పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నట్లు సమాచారం.
2015లో విడుదలైన 'యాగవరైనమ్ నా కక్కా' కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదరింది. ఆ తర్వాత 'మరగాధ నాణ్యం' చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్‌లో ఉన్నారని.. గతంలో వార్తలు వచ్చాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం ఆది-నిక్కీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పారనీ.. త్వరలోనే నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి: చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు.. చరణ్‌కు తెలియదు: రాజమౌళి