ETV Bharat / sitara

'ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు' ఎలా ఉందంటే? - 'ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు రివ్యూ

Aadavallu Meeku Johaarlu Review: శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. 'నేను శైలజ', 'ఉన్నదీ ఒకటే జిందగీ', 'చిత్రలహరి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నిజంగానే ఆడవాళ్లకు జోహార్లు అనిపించుకుందా లేదా చూడాలంటే ఈ రివ్యూ చదివేయండి..

Aadavallu Meeku Johaarlu
Aadavallu Meeku Johaarlu
author img

By

Published : Mar 4, 2022, 1:52 PM IST

Updated : Mar 4, 2022, 3:03 PM IST

చిత్రం పేరుః ఆడవాళ్లు మీకు జోహార్లు

నటీనటులుః శర్వానంద్, రష్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బెనర్జీ, సత్య తదితరులు

దర్శకత్వంః కిషోర్ తిరుమల

సంగీతంః దేవీశ్రీప్రసాద్

ఛాయాగ్రహణంః సుజిత్ సారంగ్

నిర్మాణంః ఎస్ఎల్​వీ సినిమాస్

విడుదల తేదిః 04-03-2022

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. 'నేను శైలజ', 'ఉన్నదీ ఒకటే జిందగీ', 'చిత్రలహరి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్వకత్వం వహించారు. రష్మికతోపాటు రాధిక, ఖుష్బూ లాంటి భారీ తారాగణంతో పెళ్లి నేపథ్యంగా సాగే ఈ చిత్రం టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మహిళా దినోత్సవానికి నాలుగు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం నిజంగానే ఆడవాళ్లు మీకు జోహార్లు అనిపించుకుందో లేదో తెలుసుకుందాం.

కథేంటంటే:

ఉమ్మడి కుటుంబంలో పుట్టిన కుర్రాడు చిరంజీవి(శర్వానంద్). పెద్దమ్మ, చిన్నమ్మల మధ్య అప్యాయంగా పెరుగుతూ పద్మావతి కళ్యాణ మండపం నిర్వహిస్తుంటాడు. ఇంట్లో అందరికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదే చిరు తపన. కానీ చాలా సంబంధాలు ఇంట్లో ఆడవాళ్లకు నచ్చవు. ఒక దశలో ఇంట్లో వాళ్లు రిజెక్ట్ చేసే స్థాయి నుంచి చివరకు చిరునే అవతలి సంబంధం వాళ్లు రిజెక్ట్ చేసే వరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆద్య(రష్మిక) చిరు జీవితంలోకి వస్తుంది. ఆద్యను చిరు ప్రేమిస్తాడు. కానీ ఆద్యకు తన తల్లి వకులే(ఖుష్బూ) ప్రపంచం. వకుల తన కూతురికి కాబోయే వాడు ఇల్లరికం రావాలని కోరుకుంటుంది. ఈ దశలో ఆద్యను ప్రేమించిన చిరు ఏం చేశాడు? ఆద్య, చిరుల పెళ్లికి వకుల ఎలా ఒప్పుకుందనేదే ఆడవాళ్లు మీకు జోహార్లు కథ.

ఎలా ఉందంటే:

క‌రోనా త‌ర్వాత ఇంటిల్లిపాదీ క‌లిసి థియేట‌ర్‌కి వ‌చ్చేంతగా ఆసక్తిని రేకెత్తించిన సినిమాలు అరుదుగానే వ‌చ్చాయి. ఈ సినిమా మాత్రం కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా నిర్మించింది. పేరు మొద‌లుకొని... తెర‌పై క‌నిపించే ప్రాతల వరకు కుటుంబం, మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల్ని ఆక‌ర్షించేలా ఉండ‌టం క‌లిసొచ్చే విష‌యం. దర్శకుడు కిషోర్ తిరుమల స్వచ్ఛమైన కుటుంబ వినోదంతో ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఆడ‌వాళ్ల మ‌ధ్య పెరిగిన ఓ ప‌ద్దతైన కుర్రాడు... పెళ్లిపై స‌దాభిప్రాయం లేని ఓ మ‌హిళ చుట్టూ నడిచే కథ ఇది. చిరు పెళ్లి క‌ష్టాల‌తోనే సినిమా మొద‌ల‌వుతుంది. చిరు కుటుంబం అమ్మాయిల్ని తిర‌స్కరించ‌డం ద‌గ్గర్నుంచి... వాళ్లే చిరుని తిర‌స్కరించ‌డం వ‌ర‌కు సాగే ఎపిసోడ్ ఆద్యంతం న‌వ్విస్తుంది. ఆద్యతో చిరు ప్రయాణం మొద‌లయ్యాక ఓ ప్రేమ‌క‌థ‌ని చూసిన అనుభూతి క‌లుగుతుంది. స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టే సాగుతున్నట్టు అనిపించినా కిషోర్ తిరుమల సంభాష‌ణ‌లు సినిమాకు బలాన్ని చేకూర్చాయి. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ తోపాటు ఊర్వశి మాటలు పేలాయి. దాంతో ప్రేక్షకులకు కాల‌క్షేపం అవుతుంది.

ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు
ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు

'మ‌గాళ్ల విష‌యంలో స‌మ‌స్య‌, ప‌రిష్కారం రెండూ వేర్వేరు, కానీ ఆడ‌వాళ్ల విష‌యంలో స‌మస్యని అర్థం చేసుకోవ‌డ‌మే ప‌రిష్కారం' త‌ర‌హా సంభాష‌ణ‌ల‌ు కిషోర్ తిరుమల పెన్​పవర్​ను మరోసారి చాటాయి. ద్వితీయార్థంలోనే క‌థ‌లో అస‌లు సంఘ‌ర్షణ క‌నిపిస్తుంది. ఆద్య త‌ల్లి వ‌కుల ప్రపంచంలోకి చిరు వెళ్లడం, అక్కడ చోటు చేసుకునే ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాలు త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌ని రేకెత్తిస్తాయి. అయితే ద‌ర్శకుడు సాదాసీదాగా క‌థ‌ని ముగింపు దిశ‌గా తీసుకెళ్లడం ఈ చిత్రంలో మైనస్ అని చెప్పాలి. వ‌కుల గ‌తం గురించి కేవ‌లం మాట‌ల్లోనే చెప్పించ‌డంతో అంత‌గా భావోద్వేగాలు పండ‌లేదు. హీరో, అక్కడక్కడ వచ్చిపోయే పాత్రలు మిన‌హా క‌థ‌నంతా ఆడ‌వాళ్ల చుట్టూ తిప్పిన విధానాన్ని ప్రశంసించాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే?

ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు
శర్వానంద్​, రష్మిక

శ‌ర్వానంద్ త‌న పాత్రలో ఒదిగిపోయాడు. త‌న జోనర్ క‌థ‌, పాత్ర కావ‌డంతోనేమో మ‌రింత ఆత్మవిశ్వాసంతో క‌నిపించాడు. వెన్నెల కిషోర్‌, ఊర్వశి త‌దిత‌రులతో క‌లిసి చేసిన స‌ర‌దా స‌న్నివేశాల్లో బాగా న‌వ్వించాడు. ముఖ్యంగా విరామం స‌మ‌యంలో శ‌ర్వా - ఊర్వశి చేసిన సంద‌డి కడుపుబ్బా న‌వ్వించింది. ర‌ష్మిక సంప్రదాయ‌మైన వ‌స్త్రధార‌ణ‌తో అందంగా క‌నిపించింది. రాధిక‌, ఖుష్బూ, ఝాన్సీ త‌దిత‌రులు బ‌ల‌మైన పాత్రల్లో క‌నిపించ‌డం సినిమాకి క‌లిసొచ్చింది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రథ‌మార్థంలో, స‌త్య‌, ప్రదీప్ రావ‌త్ ద్వితీయార్థంలో న‌వ్వించారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ స‌మ‌కూర్చిన బాణీలు, చిత్రీక‌రించిన విధానం మెప్పిస్తుంది. టైటిల్ గీతంతోపాటు, నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ద‌ర్శకుడు తిరుమ‌ల కిషోర్ రాసిన క‌థ‌, క‌థ‌నాలు అక్కడక్కడ తన గత చిత్రం నేను శైలజ చిత్రాన్ని గుర్తుచేసినా.. ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా సినిమాని తీర్చిదిద్దిన విధానం మాత్రం బాగుంది. అలాగే సినిమా ప్రారంభంలోనే ఇంట్లో ఆడవాళ్లను భారత క్రికెట్ జట్టులోని కీలక ఆటగాళ్లతో పోల్చడం, వాళ్లు కూడా కథనం సాగే క్రమంలో అలాగే కనిపించడం విశేషం. ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే టైటిల్ కార్డుల్లో మహిళల పేర్లు ప్రస్తావించాకే హీరో పేరు వేయడం మరో విశేషం.

బలం:

+ నటీనటులు

+ కిషోర్ తిరుమల మాటలు

+ నిర్మాణ విలువలు

బలహీనత: ఊహకు తగ్గట్టుగానే సాగిపోయే కథ

చివరగా: "ఆడవాళ్లు మీకు జోహార్లు"... అనాల్సిందే.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇదీ చదవండి: Sebastian pc524 Review: 'సెబాస్టియన్‌'గా కిరణ్ అలరించారా?

Last Updated : Mar 4, 2022, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.