ETV Bharat / sitara

అదే నా డ్రీమ్​ ప్రాజెక్ట్​: ప్రశాంత్​ వర్మ - ప్రశాంత్​ వర్మ డ్రీమ్​ ప్రాజెక్ట్​

కొత్త కథలు సిద్ధం చేసుకోవడానికి లాక్​డౌన్​ తనకు ఉపయోగపడుతున్నట్లు చెప్పారు ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు ప్రశాంత్​ వర్మ. తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ కోసం పదేళ్లుగా ఓ కథపై వర్క్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా పలు విషయాలను చెప్పుకొచ్చారు.

Prasanth Varma
ప్రశాంత్​ వర్మ
author img

By

Published : May 18, 2021, 6:45 AM IST

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ప్రశాంత్‌ వర్మ. తొలి అడుగులోనే 'అ!' లాంటి వైవిధ్యభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు రుచి చూపించి.. మంచి దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇటీవలే 'జాంబి రెడ్డి' సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. లాక్‌డౌన్‌ విరామంలో పలు ఆసక్తికర కథల్ని సిద్ధం చేసే పనిలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా' ఆయన్ను పలకరిస్తే.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కొవిడ్‌ ఉద్ధృతితో చిత్రసీమ మళ్లీ ఇలా మూత పడుతుందని ఊహించారా? ఈసారి దీని ప్రభావం పరిశ్రమపై ఎలా ఉంటుంది?
కొవిడ్‌ రెండో దశ వస్తుందన్నప్పుడు ఏమోలే అనుకున్నాం కానీ, మరీ ఇంత ప్రభావం చూపిస్తుందని అస్సలు ఊహించలేదు. కరోనా తొలి దశ తర్వాత చిత్రసీమ ఎంతో అద్భుతంగా పుంజుకుంది. డిసెంబరు నెలాఖరు నుంచి ఏప్రిల్‌ తొలి వారం వరకు ప్రతి నెలా మంచి విజయాలు చూశాం. మునుపెన్నడూ చూడనంత మంచి ఆరంభం దక్కింది. పరిశ్రమ చక్కగా నిలదొక్కుకుందని సంతోషించే లోపే మళ్లీ ఇలా మరో దెబ్బ పడింది. ఇప్పుడీ రెండో దశ ప్రభావం నుంచి చిత్రసీమ కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చు. ఎందుకంటే కొవిడ్‌ తొలి దశతో పోల్చితే ఈసారి ప్రజల్లో భయం ఎక్కువైంది. నాకు తెలిసి ఈసారి ప్రేక్షకులు మునపటి అంత వేగంగా థియేటర్లకు తిరిగి రాకపోవచ్చు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా.. చిత్ర పరిశ్రమ కచ్చితంగా నిలబడుతుందన్న నమ్మకం, భరోసా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇలా వరుస విరామాల వల్ల ఫిల్మ్‌మేకర్స్‌కు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?
దీని వల్ల లాభముంది. నష్టమూ ఉంది. అది మనం తీసుకునే దాన్ని ఆధారంగా ఉంటుంది. కొవిడ్‌కు ముందు.. తర్వాత దర్శకులు రాసిన కథల్లో, వారి ఆలోచన విధానాల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఓ దర్శకుడిగా నా వరకైతే ఈ విరామం మంచిదే అనుకుంటా. ఇప్పుడెలాంటి కథలతో ముందుకు రావాలని ఆలోచించుకోగలిగే వీలు దొరికింది. అయితే ఇప్పటికే చిత్రీకరణలు ప్రారంభించిన దర్శకులకు ఇది ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే ఓ అవకాశం దొరకడమే చాలా కష్టం. అన్నీ సెట్‌ అయ్యి.. సినిమా సెట్స్‌పైకి వెళ్లాక ఇలాంటి సమస్య ఎదురైతే మరింత కష్టం. వారు పరిస్థితులకు తగ్గట్లుగా కథల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో హీరో ఆలోచనలు మారిపోయి.. వేరే కథలోకి వెళ్దామనుకోవచ్చు. నిర్మాతలకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురవ్వొచ్చు. ఇలా రకరకాల ఇబ్బందులున్నాయి.

ఓ దర్శకుడిగా మీ కలల ప్రాజెక్ట్‌?
"పదేళ్లుగా ఓ కథపై వర్క్‌ చేస్తున్నా. పౌరాణిక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథ అది. ఆ స్క్రిప్ట్‌ను తెరకెక్కించే అనుభవం నాకిప్పటికైతే రాలేదనుకుంటున్నా. అదెలా తీయాలన్నది ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమాతో నేర్చుకుంటున్నా. వీలైనంత తక్కువ సమయంలోనే ఆ కల నిజం చేసుకోవాలని కష్టపడుతున్నా.

అందుకే ఆ సమస్య..
"నా దగ్గరున్న కథలన్నీ విభిన్నమైనవి. అవి వినగానే నిర్మాతలకి కొత్తగా అనిపిస్తోంది. అయితే వెంటనే వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు 'జాంబి రెడ్డి' కథే ఉంది. అది హాలీవుడ్‌ సినిమాలు చూసిన వాళ్లకి వెంటనే అర్థమవుతుంది. లేదంటే అది ఏదో దెయ్యం కథ అనుకుంటారు. 'అ' సినిమా నాని నిర్మించారు కాబట్టి సరిపోయింది. ఆయన కాకుండా ఆ కథను అంత చక్కగా అర్థం చేసుకొని నిర్మించడానికి ముందుకొచ్చే వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఇకపై అలాంటి క్రేజీ చిత్రాల్ని ఓటీటీకి చేయాలని నిర్ణయించుకున్నా. వాణిజ్యాంశాలను మిళితం చేసి చెప్పగలిగే కొత్త కథల్ని వెండితెరపై చూపించాలనుకుంటున్నా. ప్రస్తుతం హాట్‌స్టార్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌కి స్క్రిప్ట్‌ అందించా. ఇది కాక మరో రెండు వెబ్‌సిరీస్‌ల కోసం కథలు సిద్ధం చేస్తున్నా. వాటిలో ఒకటి హిందీలో.. మరొకటి తెలుగులో ఉంటుంది.

మీరు ఇప్పటికే 'అ!', 'జాంబిరెడ్డి' సీక్వెల్స్‌ ప్రకటించారు. వాటి స్క్రిప్ట్‌ పనులు ఎంత వరకు వచ్చాయి?
అ! సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ఎప్పుడో సిద్ధమైంది. జాం'బిరెడ్డి'కి ముందే చేయాల్సింది. 'అ2'.. 'అ!'లాగే చాలా మ్యాడ్‌ స్క్రిప్ట్‌. బాలీవుడ్‌లోని ఓ స్టార్‌తో పాన్‌ ఇండియా సినిమాగా తీద్దామని ప్రణాళిక రచించాం. అన్నీ సెట్‌ అయ్యి.. ప్రాజెక్ట్‌ ముందుకు తీసుకెళ్దామనుకునే సరికి ఆ స్టార్‌ డేట్లు సర్దుబాటు కాలేదు. దీంతో అది ఆలస్యమైంది. ప్రస్తుతం దాన్ని తెలుగులోనే తీద్దామనుకుంటున్నా. ఇక 'జాంబిరెడ్డి' సీక్వెల్‌ స్క్రిప్ట్‌ సిద్ధమవుతోంది.

ఆ మధ్య సమంతకు ఓ కథ చెప్తే.. నచ్చిందన్నారు కదా.ఈ సీక్వెల్స్‌లో అది ఒకటయ్యే అవకాశముందా?

లేదు. అది వేరే కథ. తనకు కుదిరినప్పుడు నేను వేరే చిత్రంతో బిజీగా ఉంటున్నా. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆమె వేరే సినిమాలో ఉంటున్నారు. అందుకే అది సెట్స్‌పైకి తీసుకెళ్లడం కుదరట్లేదు. కాస్త సమయం పట్టినా ఆ ప్రాజెక్ట్‌ కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే నా తర్వాతి సినిమా కోసం మరో విభిన్నమైన జానర్‌ను ఎంచుకున్నా. ఎంటర్‌ టైనింగ్‌గా ఉంటుంది. ఎవరితో చేస్తానన్నది ఇప్పటికైతే ఫిక్స్‌ అవలేదు. నేను అనుకున్న టైంలో ఎవరైనా స్టార్‌ అందుబాటులో ఉంటే.. వారితో చేస్తా. లేదంటే మళ్లీ కొత్త వారితో తీస్తా. మరో రెండు వారాల్లో ఆ ప్రాజెక్ట్‌ వివరాలు ప్రకటిస్తా.

ఇదీ చూడండి: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించిన రాంప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.