మెగా కుటుంబం నుంచి ఇప్పటి వరకు చాలా మంది కథానాయకులు వచ్చారు. ఓ కథానాయిక సైతం వెండితెరపై సందడి చేసింది. పవర్‌స్టార్ అయితే మరో అడుగు ముందుకేసి ‘జాని’ చిత్రం కోసం దర్శకుడిగానూ మారాడు. అయితే భవిష్యత్తులో ఈ కుటుంబం నుంచి ఓ పవర్‌ఫుల్ దర్శకురాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆమె మరెవరో కాదు పవర్‌స్టార్ ముద్దుల తనయ ఆద్య.
అకీరా - ఆద్య ప్రస్తుతం రేణు దేశాయ్‌తోనే ఉంటున్నా.. పండుగలకు, వేడుకలకు మెగా కుటుంబాన్ని కలుస్తూనే ఉంటారు. అయితే ఈ సారి ఆద్య వచ్చినప్పుడు చరణ్ ఆశ్చర్యపోయాడట.
మెగాస్టార్ ఇంట్లో ఓ బ్లాక్ బోర్డు ఉంటుంది. ఇంటికి వచ్చి వెళ్లే ముందు వారికి నచ్చిన పని ఏం చేయబోతున్నారు.. ఏం చేయాలని అనుకుంటున్నారు అనే విషయాలను అక్కడ ఉన్న బ్లాక్ బోర్డు పై రాసి వెళ్ళాలి. అయితే పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య.. తన అన్నయ్య చరణ్ ఇంటికి వెళ్ళినప్పుడు తన మనసులోని మాటను రాసిపెట్టింది. అదేమంటే అన్నయ్య చరణ్ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని రాసిపెట్టిందట. ఈ విషయం తెలిసి చరణ్ షాక్ అయ్యాడు. తన చిట్టి చెల్లెలు ఆద్య కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
పవన్ కూమారుడు అఖీరా.. ఇప్పటికే తన తల్లి రేణు దేశాయ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించాడు.
ఇదీ చూడండి : జైలు జీవితం గడిపిన షారుక్‌ఖాన్!