ETV Bharat / sitara

బాలు జయంతికి టాలీవుడ్​ స్వరనీరాజనం - Tribute to SPB

జూన్​ 4న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా టాలీవుడ్​లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆయన పుట్టినరోజున బాలుకు స్వరనీరాజనం అర్పించబోతున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్​ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు.

bala subrahmanyam birthday
బాలు జయంతి
author img

By

Published : May 30, 2021, 6:29 PM IST

తన పాటలతో ఆబాలగోపాలాన్ని అలరించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని తెలుగు సినీపరిశ్రమ ఘనంగా నిర్వహించబోతుంది. జూన్ 4న ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అర్పించబోతుంది. ఆ రోజంతా సినీలోకం బాలు నామాన్ని స్మరించబోతుంది.

స్వరబ్రహ్మ డైమండ్ జూబ్లీ వేడుకలను 12 గంటలపాటు ఆన్​లైన్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో కథానాయకులు, కథానాయికలు, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, గేయ రచయితలందరూ పాల్గొనబోతున్నారు.

తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఎస్పీబీ చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఆయన జయంతిని జరుపుకోబోతున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. మెలోడిబ్రహ్మ మణిశర్మ బాలసుబ్రహ్మణ్యంపై స్వరపర్చిన ప్రత్యేక గీతాన్ని జూన్ 4న ఆవిష్కరించనున్నట్లు పట్నాయక్ వెల్లడించారు. ఎస్పీబీకి ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ తాను సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: దివంగత గాయకులు ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.