స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్‌లు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారట. ఏకంగా 5 కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందించారట. 'అల వైకుంఠపురములో' టైటిల్ లోగోలో కనిపిస్తోన్న భవనంతో పాటు, ఓ విలేజ్ సెట్ వేశారని సమాచారం.
ఇవీ చూడండి.. పునాది రాళ్లు నుంచి సైరా వరకు తగ్గని 'మెగా' జోరు