'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్నాడు బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు. తనను కథానాయకుడిగా నిలబెట్టేందుకు సినీ ప్రముఖులంతా మద్దతుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెంచేశాయి. అయితే వారి అంచనాలకు అందుకునేలా సినిమా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. ప్రదీప్ చాలా భయపడుతూ ఈ సినిమా చేసినట్లు దర్శకుడు మున్నా తెలిపాడు.
ఇందులో ప్రదీప్.. రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తాడు. అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. ఎస్వీ బాబు నిర్మాత. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇదీ చూడండి.. లిరికల్ వీడియో: 'ఏయ్ పిల్లా.. పరుగున పోదామా'