ETV Bharat / sitara

రామానాయుడు స్టూడియోలో '22' షూటింగ్​ షురూ - రామానాయుడు స్టూడియోస్

శివకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న '22' సినిమా.. హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ హీరోలు వెంకటేశ్, సాయితేజ్​తో పాటు పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు.

'22' సంఖ్య వెనకున్న రహస్యం ఏంటి?
author img

By

Published : Jul 22, 2019, 8:21 PM IST

22 సినిమా ప్రారంభ వేడుక కార్యక్రమం

ప్రముఖ దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రం '22'. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కనున్న ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. హీరోలు విక్టరీ వెంకటేశ్, సాయితేజ్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాతలు బీవీఎస్​ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, అశ్వనీదత్, శ్యామ్​ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రంలో రూపేశ్ కుమార్, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాల్ని పంచుకున్నాడు దర్శకుడు శివకుమార్.

"పూరీ జగన్నాథ్, వి.వి. వినాయక్‌ల స్ఫూర్తితోనే దర్శకుడిగా మీ ముందుకొస్తున్నా. వీరి వద్ద సహాయకుడిగా పనిచేశా. మా అమ్మ బి.జయ వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. దర్శకుడిగా నా తొలి చిత్రానికి హీరో వెంకటేశ్ క్లాప్‌ కొట్టడం చాలా సంతోషంగా ఉంది. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంతో మిళితమైన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ‘22’ సంఖ్యను టైటిల్​గా పెట్టడం వెనుక ఓ ట్విస్ట్‌ ఉంది. అదేంటన్నది థియేటర్లో చూసి తెలుసుకోవాలి." -దర్శకుడు శివకుమార్

22 movie lauch event
'22' సినిమా ప్రారంభ వేడుక

ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: మథనం టీజర్​ రిలీజ్ వేడుకలో 'సైరా' స్టార్​

Sriharikota (Andhra Pradesh), July 22 (ANI): The Indian Space Research Organistaion (ISRO) launched the Chandrayaan-2 from the Satish Dhawan Space Centre in Andhra Pradesh's Sriharikota today. India will be the first country to land on the south pole region of the Moon. While addressing in Sriharikota on this occasion, ISRO Chairman K Sivan said, "I am extremely happy to announce that the GSLV MkIII-M1 successfully injected Chandrayaan-2 spacecraft into Earth Orbit. It is the beginning of a historic journey of India towards moon and to land at a place near South Pole to carry out scientific experiments." "After that serious technical snag we had, we fixed it and now ISRO has bounced back with flying colours," Sivan added.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.