ETV Bharat / sitara

మాటల తూటా...పాటల తోట.. 'నువ్వే కావాలి' - నువ్వే కావాలి సినిమా వార్తలు

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో, తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. మంగళవారానికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం సూపర్​హిట్​ అవ్వడానికి ప్రధాన కారణం అందులోని సంభాషణలు, పాటలే. ఈ సందర్భంగా వాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

20 Years Completed For Nuvve Kavali Movie
మాటల తూటా...పాటల తోట.. ఈ 'నువ్వే కావాలి'
author img

By

Published : Oct 11, 2020, 7:31 AM IST

Updated : Oct 11, 2020, 9:33 AM IST

ఓ చిత్రం విజయం సాధించాలంటే కథాబలం ఎంత అవసరమో.. ఆ కథను నడపించే సంభాషణలు, కథలో అనుగుణంగా వచ్చే గీతాలు అంతే అవసరం. అలా అన్నీ పొందికగా కుదిరాయి కాబట్టే.. 'నువ్వే కావాలి' అంతటి ఘన విజయాన్ని అందుకుంది. సుదీర్ఘ సంభాషణలే కానీ అప్పటివరకూ తెలుగు సినిమాకి పెద్దగా పరిచయం లేని పంచ్ డైలాగ్ లతో రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం కదం తొక్కితే.. సుస్వరాల మాంత్రికుడు కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు ఎన్నటికీ వన్నెతరగని వర్ణాలను అద్దింది.

మాటల తూటా...పాటల తోట.. 'నువ్వే కావాలి'

సంభాషణలే ప్రాణం

'ఇడ్లీనా.. డెడ్లీగా ఉంటుంది', 'పాలంటే ఎలర్జీ, కానీ పాలే ఎనర్జీ', 'నీకు ఉదయమే అయింది, నాకు జ్ఞానోదయం కూడా అయింది' క్లుప్తంగా ఇలాంటి పంచ్ ఉన్న డైలాగ్​లు అంతకుముందు తెలుగు సినిమాల్లో వినపడింది లేదు. దీనికి ఆద్యుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతకు ముందు విజయ్ భాస్కర్​తో కలిసి 'స్వయంవరం' సినిమాలో ఇదే తరహా డైలాగులు కొన్ని రాసిన త్రివిక్రమ్ రచనాశైలి.. తెలుగు ప్రేక్షకులను రంజింప చేసింది. కేవలం పంచ్ డైలాగ్​లే కాదు, కామెడీ సీన్లూ ఈ సినిమాలో అద్భుతంగా పండాయి.

సునీల్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మెల్కొటే- కోవై సరళ కాంబినేషన్​లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సునీల్‌కు కూడా ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. శరీరాలు వేరు ఆత్మ ఒక్కటే అన్నట్లుంటేలా తరుణ్, రిచాల పాత్రలను తీర్చిదిద్దిన వైనం.. యుక్తవయస్సులో కలిగే ప్రేమ, సున్నితమైన ఆ భావోద్వేగాలు ఇలా అన్ని సంభాషణలను త్రివిక్రమ్ - విజయ్ భాస్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

నువ్వే కావాలి సినిమాలోని కొన్ని డైలాగులు

  1. "వెళ్లిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది. మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం కష్టం!"
  2. గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం. కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పగలం
  3. మంట దూరంగా ఉంటే వేడి తెలీదు. మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలీదు.
  4. ఇష్టపడితే భయపడకు. భయపడితే ఇష్టపడకు. ఇష్టపడి, భయపడితే బాధపడకు

ఇలాంటి సంభాషణలు సన్నివేశాలను పండించటమే కాదు.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టాయి.

20 Years Completed For Nuvve Kavali Movie
మాటల తూటా...పాటల తోట.. 'నువ్వే కావాలి'

సెన్సేషనల్​ మ్యూజిక్ ఆల్బమ్​

ఈ సినిమాలో మాటలు గొప్పగా ఉన్నాయా.. పాటలు గొప్పగా ఉన్నాయా అంటే చెప్పటం కష్టం. కానీ ఈ సినిమా విజయంలో సంగీతానికి ఉన్న స్థానం అనిర్వచనీయం. కోటి అందించిన స్వరాలకు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్ర అందించిన సాహిత్యం తోడై.. అద్భుతమైన గీతాలు సినీ అభిమానులకు అందాయి. "అనగనగా ఆకాశం ఉంది" పాట ఎన్ని అంత్యాక్షరీల్లో భాగం అయ్యిందో చెప్పటం కష్టం.

"కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు" అంటూ కథానాయిక అంతరంగాన్ని ఆవిష్కరించే భావోద్వేగ భరితమైన గీతం.. చిత్రమ్మ గానామృతంతో ఎంతమంది గుండె తడిని రుచిచూసిందో ఎలా చెప్పగలం. పాట పాడుతున్నప్పుడు రెండో చరణంలో నిజంగానే చిత్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లతో పాడారట. పాటలో చిత్రమ్మ లీనమైపోయిన వైనానికి ఆశ్చర్యపోయిన కోటి.. ఆమెకు గౌరవమిస్తూ ఆ పాటను యథాతథంగా ఉంచేశారట.

"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ" అని ఎంత మంది ప్రియులు తమ ప్రేయసుల కోసం పాడుకున్నారో...! శ్రీరామ్ ప్రభు ఈ పాటతో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. "ఒలె ఒలె ఊలా ఊలా" అంటూ ప్రత్యేక గీతంతో నాటి టాప్ హీరోయిన్ లైలా చేసిన సందడిని ఏ కుర్రాడూ మర్చిపోడు. షుక్రియా సాంగ్, అమ్మమ్మలు తాతయ్యలకు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి. టేప్ రికార్డర్ల జమానాలో ఈ ఆల్బమ్ సృష్టించిన సెన్సేషన్​ సినిమా థియేటర్లలో పాటలను రిపీట్ వేయాలని ఆడియన్స్ నుంచి వచ్చిన డిమాండ్​లు.. అన్నీ 'నువ్వేకావాలి' చరిత్రలో నిలిచిపోవటానికి కారణాలయ్యాయి.

మూస ధోరణితో సాగిపోతున్న తెలుగు సినిమాను ఓ సారి ఆపి.. సంభాషణల పదును, సంగీతం ప్రాధాన్యాన్ని చూపించిన సినిమా 'నువ్వే కావాలి'. రికార్డుల మోత మోగించటానికి అవసరమైన ఉత్సాహాన్ని అందించటంలో ఈ రెండు విభాగాల పాత్ర అద్వితీయం.. అనిర్వచనీయం.

Last Updated : Oct 11, 2020, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.