ETV Bharat / sitara

సోనూసూద్​కు అక్కడి నుంచి 11వేల ఉత్తరాలు - సోనూసూద్​ వలసకూలీల ఉత్తరాలు

వలసకూలీల విషయంలో నటుడు సోనూసూద్​ చూపిస్తున్న ఔదార్యానికి అన్నిచోట్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఒడిశాలోని ఓ జిల్లావాసులు సోనూకు కృతజ్ఞత తెలుపుతూ వినూత్న కార్యక్రమం చేపట్టారు.

sonusood
సోనూసూద్
author img

By

Published : Jun 12, 2020, 8:37 AM IST

పలుచోట్ల చిక్కుకుపోయిన వలసకూలీల కోసం బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ ఎంతో కృషి చేస్తున్నారు. బస్సులు, విమానాలు, ప్రైవేట్​ వావానాల్లో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇటీవలే ఒడిశా కేంద్రపారా జిల్లాలో చిక్కుకున్న వందలాది మంది యువతులను తమ స్వస్థలాలకు చేర్చారు. ఈ సందర్భంగా సోనూకు కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రపారా నౌజవాన్​ యూనియన్​ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'థ్యాంక్​ యూ సోనూ' పేరుతో సుమారు 11వేల పోస్టుకార్డులను ఆయన ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసింది. జిల్లా మేజిస్ట్రేట్​ సమర్త్​​ బర్మా ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.

సోనూసూద్​ ఇంటికి ఉత్తరాలు

జిల్లాలోని వివిధ బ్లాక్​లు, మున్సిపాలిటీల నుంచి 8,500 ఉత్తరాలు పంపనున్నారు. సాలేపూర్​, మహంగా నియోజకవర్గాలకు చెందిన మరో 2,500 పోస్టుకార్డులను.. ముంబయి పశ్చిమ అంధేరి యమునానగర్​లోని సోనూ నివాసానికి చేరవేయనున్నట్లు యూనియన్​ అధ్యక్షుడు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.