ETV Bharat / science-and-technology

Youtube Shorts Play Store : గూగుల్​ ప్లేస్టోర్​లో 'యూట్యూబ్​' షార్ట్స్​​.. ఏం చూడవచ్చో తెలుసా? - యూట్యూబ్ షార్ట్స్ గూగుల్​ ప్లే స్టోర్​

Youtube Shorts Google Play Store Ads : ప్రముఖ సంస్థ గూగుల్​ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం విశేషంగా జనాదరణ పొందుతున్న యూట్యూబ్​ షార్ట్స్​ను త్వరలోనే గూగుల్​ ప్లే-స్టోర్​లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్లేస్టోర్​లో షార్ట్స్​లో ఏ కంటెంట్​ ఉందంటే?

Youtube Shorts Google Play Store Ads
YouTube Shorts Is Coming To The Google Play Store
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 2:46 PM IST

Youtube Shorts Google Play Store Ads : విశేషమైన జనాదరణను సొంతం చేసుకుంటున్న యూట్యూబ్​లోని ప్రముఖ సెగ్మెంట్​ 'షార్ట్స్'​ త్వరలోనే గూగుల్​ ప్లే-స్టోర్​లో కనిపించనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే గూగుల్​ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ప్రముఖ వెబ్​సైట్​ వెల్లడించింది. ఈ షార్ట్​ వీడియోస్​ కేవలం కంపెనీల ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రమోషన్​ వీడియోస్​ అని​ పేర్కొంది. ఇప్పటికే ప్లే-స్టోర్​లో యాడ్​ల రూపంలో అనేక ప్రమోషన్​ వీడియోస్​ కనిపిస్తుంటాయి. ఇక వీటికి అదనంగా ప్రమోషన్స్​కు సంబంధించిన యూట్యూబ్​ షార్ట్స్​ వీడియోస్​ కూడా మున్ముందు ప్లే-స్టోర్​లో దర్శనమివ్వనున్నాయి.

ముందు ఆ దేశంలో ట్రయల్​ రన్​..
Youtube Shorts Google Play : YouTube Shorts సిరీస్​లో భాగంగా ఇప్పటికే దీనిని పైలట్​ ప్రాజెక్ట్​ కింద అమెరికాలో ప్రవేశపెట్టి పరీక్షిస్తున్నారు. ఒకవేళ అక్కడ సానుకూల ఫలితాలు సాధిస్తే.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమోషన్స్​ షార్ట్స్​ వీడియోస్​​ను అందరికీ పరిచయం చేయనున్నారు. ఈ యాప్​ పేరును 'ది ప్లే రిపోర్ట్​' అని తెలుస్తోంది. యూజర్స్​ కొత్తగా వచ్చే యాప్​లను కనుగొనడమే కాకుండా.. డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలుగా ఈ షార్ట్​ వీడియోస్​ను భవిష్యత్​లో ఎడిటోరియల్​ కంటెంట్​లో యాడ్​ చేయనున్నారు.

Youtube Shorts Play Store : అత్యుత్తమ రేటింగ్​ కలిగిన సంస్థలకు సంబంధించిన యాప్​లను మాత్రమే గూగుల్​.. మన ప్లే-స్టోర్​లో చూపిస్తుంటుంది. ఇందులో మంథ్లీ పిక్స్​, న్యా ఆన్​ ప్లే, టీచర్​ అప్రూవ్డ్​ ప్రోగ్రామ్స్​తో పాటు గేమ్స్​, ఫుడ్​ రెసిపీస్​ యాప్స్​, ఎక్స్​పర్ట్​ వాయిసెస్​, హెల్త్ యాప్స్​ సహా గూగులర్స్​, యూట్యూబర్స్​కు సంబంధించిన అనేక రకాల యాప్స్​ను కూడా మనం సజ్జస్టెడ్​ యాప్స్​ కేటగిరీలో చూడవచ్చు. ఇక త్వరలోనే గూగుల్​ తీసుకురానున్న ఈ నూతన షార్ట్ వీడియోస్(యాడ్స్​)​ ఫీచర్​​ను కూడా టాప్​ లిస్ట్​లో వీక్షించొచ్చు.

ప్లే-స్టోర్​లో లేకపోతే అక్కడ కూడా..
Shorts In Google Play Store : ఈ ప్రమోషన్స్​కు సంబంధించిన షార్ట్​ వీడియోస్​​ను ప్లే-స్టోర్​కు ఎగువన అంటే టాప్​ లిస్ట్స్​లో మనం గమనించవచ్చు. అయితే సాధారణంగా ప్రమోషన్స్​లో భాగంగా వచ్చే ఇతర హై-ప్రొఫైల్​ సజ్జస్టెడ్​ యాప్స్​ లేదా కంటెంట్​ను వెనక్కి నెట్టి మరీ ఈ షార్ట్​ వీడియోస్​ ముందు వరుసలో కనిపించనున్నాయని తెలిసింది. సంబంధిత కంపెనీకి చెందిన యాప్​ను నేరుగా ఈ షార్ట్​ వీడయో నుంచే డౌన్​లోడ్​ చేసుకోవచ్చట. ఇందుకోసం వీడియోకు దిగువనే ఇన్​స్టాల్​ బటన్​ను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ గూగుల్​ ప్లే-స్టోర్​లో ఈ ప్రమోటెడ్​ షార్ట్ వీడియోస్​ కనిపించకపోతే గనుక గూగుల్​ ప్లే-స్టోర్​కు సంబంధించిన అధికారిక సోషల్​ మీడియా అకౌంట్స్​తో పాటు యూట్యూబ్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో కూడా వీటిని చూడవచ్చు.

YouTubers Failing Reasons : మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలా?.. ఈ తప్పులు చేయకండి!

Youtube Humming Feature : యూట్యూబ్​లో కొత్త ఫీచర్​.. నచ్చిన పాట హమ్​ చేస్తే చాలు.. వెంటనే సాంగ్​ ప్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.