ETV Bharat / science-and-technology

ఈ తప్పులు చేస్తున్నారా?.. అయితే మీ వాట్సాప్​ అకౌంట్​ బ్లాక్​!

author img

By

Published : Feb 27, 2022, 8:00 PM IST

WhatsApp Safety Tips: భద్రతపరంగా యాప్‌ వినియోగాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్‌ ప్రతి నెలా నకిలీ ఖాతాలను తొలగించడంతోపాటు, వేర్వేరు కారణాలతో ఖాతాలపై నిషేధం విధిస్తుంటుంది. మరి వాట్సాప్ ఎలాంటి తప్పులు చేస్తే ఖాతాలపై నిషేధం విధిస్తుందంటే..?

WhatsApp users mistakes
WhatsApp users mistakes

WhatsApp Safety Tips: ఆన్‌లైన్‌ భద్రతపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. యూజర్‌ ఫ్రెండ్లీ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కూడా కొత్తగా 'సేఫ్టీ ఇన్‌ ఇండియా' పేరుతో రిసోర్స్ హబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ యాప్‌ను సుమారు 400 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతపరంగా యాప్‌ వినియోగాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్‌ ప్రతి నెలా నకిలీ ఖాతాలను తొలగించడంతోపాటు, వేర్వేరు కారణాలతో ఖాతాలపై నిషేధం విధిస్తుంటుంది. ఇలా వాట్సాప్‌ నిషేధించే ఖాతాల్లో కొన్ని కంపెనీ నిబంధనలు అతిక్రమించడంవల్ల, మరికొన్ని అవగాహన లోపంతో యూజర్స్‌ చేసే పొరపాట్ల వల్ల జరిగేవే ఉంటున్నాయి. మరి వాట్సాప్ ఎలాంటి తప్పులు చేస్తే ఖాతాలపై నిషేధం విధిస్తుందో తెలుసుకుందాం.

  1. వాట్సాప్‌ వినియోగదారుల్లో చాలా మంది గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌లో వచ్చే ఫైల్స్‌ను ఇతరులకు ఫార్వాడ్‌ చేస్తుంటారు. కొన్నిసార్లు మాల్‌వేర్‌ లేదా వైరస్‌ ఉన్న ఫైల్స్‌ను తెలియకుండానే ఫార్వాడ్ చేసేస్తాం. దానివల్ల మీ ఫోన్‌లోకి మాల్‌వేర్‌ లేదా వైరస్‌ వచ్చి చేరే ప్రమాదం ఉంది. వాట్సాప్‌లో మాల్‌వేర్‌ ఫైల్స్‌ను ఫార్వాడ్ చేయడం నిషేధం. మీరు ఫార్వాడ్‌ చేసిన ఫైల్స్‌లో మాల్‌వేర్ ఉందనే విషయం మీకు తెలియనప్పటికీ, మీ ఖాతా ద్వారా మాల్‌వేర్‌ వ్యాప్తి చేస్తున్నారని ఇతరులు ఫిర్యాదు చేసినా, వాట్సాప్‌ గుర్తించినా, మీ ఖాతాపై నిషేధం విధించవచ్చు. అందుకే మీరు ఫార్వాడ్ చేసే ఫైల్స్‌ అనుమానాస్పదంగా ఉంటే వాటిని డిలీట్ చేయడం ఉత్తమం.
  2. గుర్తింపు లేని నంబర్స్‌ లేదా తెలియని నంబర్స్​ను వాట్సాప్‌లో ఫార్వాడ్ చేయడం, గ్రూపులలో యాడ్ చేయమని కోరవద్దు. ఎందుకంటే నకిలీ సమాచారం వ్యాప్తి చేసే, గుర్తింపు లేని నంబర్లను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో మీ ఖాతాపై వాట్సాప్‌ నిషేధం విధించవచ్చు. అందుకే అపరిచితులు, గుర్తింపు లేని ఖాతాల నుంచి వచ్చే కస్టమర్‌ కేర్ నంబర్లు లేదా ముఖ్యమైన నంబర్లు అంటూ వచ్చే వాటిని ఫార్వాడ్‌ లేదా షేర్‌ చేయొద్దు.
  3. నకిలీ సమాచార వ్యాప్తి కోసం ఎక్కువ మంది నకిలీ ఖాతాలను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఆఫర్ల పేరుతో యూజర్లను మోసం చేసేందుకు బిజినెస్ ఖాతాల ద్వారా ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని గుర్తించి వాట్సాప్‌ ఎప్పటికప్పుడు తొలగించడం లేదా నిషేధిస్తుంది. కొన్నిసార్లు స్నేహితులను, దగ్గరి వారిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో పేర్లు, ఇతరత్రా వివరాలు మార్చి ఖాతాలు క్రియేట్ చేస్తుంటాం. ఒకవేళ యూజర్స్‌ దానిపై ఫిర్యాదు చేస్తే నకిలీ ఖాతాతోపాటు, దానికి అనుబంధంగా ఉన్న ఫోన్‌ నంబర్‌తో ఎలాంటి ఖాతా తెరవకుండా వాట్సాప్ నిషేధం విధిస్తుంది.
  4. వాట్సాప్‌లో అధిక సంఖ్యలో మెసేజ్‌లు ఒకేసారి పంపడం, ఆటో-మెసేజ్‌ లేదా ఆటో-డయల్‌ చేయకూడదు. అలా చేసే వారి ఖాతాలను వాట్సాప్‌ మెషీన్‌ లెర్నింగ్ టెక్నాలజీతో గుర్తించడంతోపాటు, యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా సదరు ఖాతాలపై నిషేధం విధిస్తుంది.
  5. వాట్సాప్‌లో ఉండే ఫీచర్లు కాకుండా, అదనపు ఫీచర్ల కోసం కొంత మంది యూజర్స్‌ మోడిఫైడ్‌ వెర్షన్‌ వాట్సాప్‌ యాప్​లను వినియోగిస్తుంటారు. ఈ జాబితాలో డెల్టా వాట్సాప్‌, జీబీ వాట్సాప్‌, వాట్సాప్‌ ప్లస్ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా ఖాతాలు తెరవడం, మెసేజింగ్ చేయడం, గ్రూపులు క్రియేట్‌ చేయడంపై వాట్సాప్‌ నిషేధం విధించింది. ఎందుకంటే వీటికి వాట్సాప్‌లో ఉండే ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉండదు. అలానే వీటి ద్వారా యూజర్‌ డేటా సులువుగా హ్యాకర్స్‌కు చేరిపోతుంది.
  6. వాట్సాప్‌లో ఒకే మెసేజ్‌ ఎక్కువ మందికి పంపాలనుకునే వాళ్లు బ్రాడ్‌కాస్ట్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే బ్రాడ్‌కాస్ట్‌ ఫీచర్‌ ద్వారా తరచుగా మెసేజ్‌లు పంపినట్లు వాట్సాప్‌ గుర్తించినా లేదా ఇతరులు మీ ఖాతాపై ఫిర్యాదు చేసినా సదరు ఖాతాపై వాట్సాప్ నిషేధం విధించవచ్చు. అందుకే బ్రాడ్‌కాస్ట్‌ ఫీచర్‌ను అవసరమైతే తప్ప ఎక్కువసార్లు ఉపయోగించకపోవడం ఉత్తమం.
  7. ఇతరుల నుంచి మెసేజ్‌ వచ్చినప్పుడు, వారితో సంభాషించడం ఇష్టం లేకపోతే మెసేజ్‌ చేయడం ఆపమని మీరు కోరినా, కొన్నిసార్లు మెసేజ్‌లు పంపుతూనే ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీరు సదరు ఖాతాపై వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. తర్వాత మీరు ఫిర్యాదును పరిశీలించి వాట్సాప్‌ సదరు ఖాతాపై చర్యలు తీసుకుంటుంది. ఇదేవిధంగా మీరు మెసేజ్‌ చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పైవిధంగా కోరినా వెంటనే మెసేజింగ్ ఆపేయండి. ఒకవేళ మీపై వాట్సాప్‌కు ఫిర్యాదు చేస్తే ఖాతా నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అపరిచిత వ్యక్తులను నుంచి వచ్చే సందేశాలను అడ్డుకునేందుకు వాట్సాప్‌లో బ్లాక్‌, రిపోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి: మోటోరోలా సరికొత్త 5జీ ఫోన్​.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.