ETV Bharat / science-and-technology

ఫైల్ షేర్, ప్రింట్, క్లౌడ్ స్పేస్​.. వైఫై రౌటర్లలోని 6 ఎక్స్​ట్రా ఫీచర్స్​ తెలుసా? - వైఫై రౌటర్ పేరెంటల్ కంట్రోల్స్

వర్క్ ఫ్రమ్​ హోమ్, ఆన్​లైన్​ క్లాసుల జమానాలో దాదాపు ప్రతి ఇంట్లోనూ వైఫై రౌటర్ తప్పనిసరి అయింది. ఇంట్లోని స్మార్ట్ డివైజెస్​ అన్నింటినీ ఇంటర్నెట్​తో కనెక్ట్ చేసేందుకు ఉపయోగపడే రౌటర్లతో మరికొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయని విన్నారా? ఫైల్ షేరింగ్, పేరెంటల్ కంట్రోల్స్, ఫైల్స్ ప్రింటింగ్, గెస్ట్ నెట్​వర్క్​, షెడ్యూల్ యాక్సెస్, పర్సనల్ క్లౌడ్ స్పేస్​ ఫీచర్స్​ ఎలా వాడాలో తెలుసా?

wifi routers uses in telugu
ఫైల్ షేర్, ప్రింట్, క్లౌడ్ స్పేస్​.. వైఫై రౌటర్లలోని 6 ఎక్స్​ట్రా ఫీచర్స్​ తెలుసా?
author img

By

Published : Sep 19, 2022, 12:15 PM IST

Wifi routers uses in Telugu : ఇంటర్నెట్​ సర్వీస్ ప్రొవైడర్​ నుంచి మన ఇంటికి అంతర్జాలం వచ్చేలా చూసే సాధనం మోడెమ్. అలా వచ్చిన ఇంటర్నెట్​ను మన కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు, స్మార్ట్​ ఫోన్లు, ఇతర డివైజ్​లతో కనెక్ట్​ చేసే మాధ్యమమే వైఫై రౌటర్. ఇన్​కమింగ్​, ఔట్​గోయింగ్​ ఇంటర్నెట్ ట్రాఫిక్​ను మేనేజ్ చేయడమే కాక.. ఈ రౌటర్​తో అనేక ఉపయోగాలు ఉంటాయి. ఆయా ఫీచర్స్​ను వాడుకుంటే.. మనం చాలా పనుల్ని సులభంగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చు. అవేంటంటే..

1. ఫైల్ షేరింగ్
How to share files using wifi router : బ్లూటుత్​ ద్వారా వేర్వేరు డివైజ్​ల మధ్య ఫైల్​ షేరింగ్ కాస్త కష్టమే. ఫైల్​ సైజ్​ పెద్దగా ఉంటే.. ట్రాన్స్​ఫర్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అయితే.. వైఫై రౌటర్​తో ఈ పని చాలా సులువుగా, వేగంగా పూర్తవుతుంది. హోమ్​ నెట్​వర్క్​కు కనెక్ట్​ అయిన అనేక డివైజ్​లకు ఒకేసారి ఫైల్​ షేర్​ చేయవచ్చు.

విండోస్​ 11లో ఏదైనా ఫైల్​ లేదా ఫోల్డర్​ను నెట్​వర్క్​లో షేర్ చేయాలంటే.. ఆ ఫైల్​పై రైట్​ క్లిక్​ చేయాలి. "Give access to > Specific people" సెలక్ట్ చేయాలి. Share with > Homegroup (Read or Read/Write) ఎంచుకుంటే మన ఇంట్లోని ఇతర డివైజ్​లకూ ఫైల్స్​ షేర్​ చేయవచ్చు. తర్వాత.. కంట్రోల్​ ప్యానల్​ ఓపెన్ చేసి.. Network and sharing centre on the home network కు వెళ్లాలి. లెఫ్ట్​ ప్యానల్​లో "Change advanced sharing options" ఎంచుకుని.. "Turn on file and printer sharing" పై క్లిక్ చేయాలి.

2. ఫైల్స్​ ప్రింటింగ్
wifi router printer sharing : వైఫై ద్వారా ఫైల్​ ప్రింటింగ్​ కమాండ్స్ ఇవ్వవచ్చు. అయితే.. ఇందుకోసం మన దగ్గర ఉన్న ప్రింటర్​కు వైర్​డ్​ నెట్​వర్క్​ కనెక్టర్​ లేదా వైఫై అడాప్టర్​ ఉండి తీరాలి. వాటి సాయంతో ప్రింటర్​ను కూడా హోమ్​ నెట్​వర్క్​కు కనెక్ట్ చేస్తే.. ఇంట్లోని ఏ డివైజ్​ నుంచైనా ఫైల్స్​ ప్రింట్ చేయవచ్చు.

3. పేరెంటల్ కంట్రోల్స్
wifi router parental control : మన వైఫై నెట్​వర్క్​ ద్వారా ఇబ్బందికరమైన వెబ్​సైట్స్​ను యాక్సెస్​ చేయకుండా నిలువరించేందుకు రౌటర్లలోని 'పేరెంటల్ కంట్రోల్స్​' ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం.. హోం నెట్​వర్క్​కు కనెక్ట్ అయిన డివైజ్​లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. 192.168.1.1 ఐపీ అడ్రెస్​తో వైఫై రౌటర్​కు కనెక్ట్ కావాలి. admin, password ను యూజర్​నేమ్​, పాస్​వర్డ్​గా ఎంటర్ చేయాలి(ఇవి డిఫాల్ట్​గా ఉంటాయి. మీరు మార్చి ఉంటే.. అవి ఎంటర్ చేయాలి). లాగిన్ అయ్యాక.. Advanced > Security > Block sites కు వెళ్లి.. అవసరం లేని వెబ్​సైట్స్​ బ్లాక్​ చేయండి.

ఇదీ చదవండి : బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్‌ కహానీ తెలుసా?

4. గెస్ట్ నెట్​వర్క్ సెట్ అప్
wifi router guest network : అతిథులు/ బయటి వ్యక్తులకు ఒక్కోసారి మన వైఫై పాస్​వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. అది కాస్త ఇబ్బందికరమే. ఇతరులు కనెక్ట్​ అయితే.. హోం నెట్​వర్క్​లోని డివైజ్​లు అన్నింటికీ హ్యాకింగ్​ ముప్పు ఉండొచ్చు. గెస్ట్ నెట్​వర్క్​ సెట్ చేసుకుంటే.. ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇందుకోసం పెద్దగా చేయాల్సిందేమీ లేదు. పేరెంటల్​ కంట్రోల్స్​ తరహాలోనే రౌటర్​లోకి లాగిన్ కావాలి. అక్కడ గెస్ట్​ వైఫై యాక్సెస్​ ఎనేబుల్​ చేయాలి. అప్పుడు మన పాస్​వర్డ్ చెప్పకుండానే అతిథులు/బయటి వ్యక్తులు వైఫై వాడుకోవచ్చు.

5. షెడ్యూల్​ యాక్సెస్​
గెస్ట్ నెట్​వర్క్​కు కనెక్ట్​ అయిన డివైజ్​లు ఎంతసేపు, ఏమేర ఇంటర్నెట్​ యాక్సెస్​ చేయవచ్చు అనేదానికీ పరిమితులు విధించవచ్చు. ఒకటికన్నా ఎక్కువ డివైజ్​లు గెస్ట్​ నెట్​వర్క్​కు కనెక్ట్ అయి ఉంటే.. ఏదైనా ఒకదానికి మాత్రమే ఇవి వర్తించేలా చేయవచ్చు.

6. పర్సనల్ క్లౌడ్ స్పేస్
wifi router cloud storage : యూఎస్​బీ పోర్ట్​ ఉన్న వైఫై రౌటర్లకు ఎక్స్​టర్నల్ హార్డ్​ డ్రైవ్స్​ కనెక్ట్ చేయవచ్చు. ఆ డ్రైవ్స్​లోని ఫైల్స్​ను హోం నెట్​వర్క్​లోని ఏ డివైజ్​ నుంచైనా యాక్సెస్ చేయవచ్చు.
ఈ ఫీచర్స్​లో చాలా వరకు దాదాపు అన్ని రౌటర్స్​లో ఉంటాయి. మిగిలినవి కొన్ని ప్రత్యేక మోడల్స్​లో మాత్రమే ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.