ETV Bharat / science-and-technology

Background apps on Android: ఆండ్రాయిడ్​ ఫోన్లలో అలా చేస్తే నష్టమే! - బ్యాక్​గ్రౌండ్​ యాప్స్​ మూసివేస్తే నష్టమే

Background apps on Android: బ్యాక్‌గ్రౌండ్‌ మెమరీలో యాప్స్‌ ఉండే విధంగానే ఆండ్రాయిడ్‌ను రూపొందించారు. అవసరమైనప్పుడు దానికి అదే యాప్స్‌ను క్లోజ్‌ చేసుకునేలా తయారుచేశారు కూడా. అందువల్ల మనం పని గట్టుకొని క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ.

Background apps on Android
Background apps on Android
author img

By

Published : Dec 23, 2021, 12:37 PM IST

Background apps on Android: ఫోన్‌లో తరచూ రీసెంట్‌ యాప్స్‌ ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తుంటాం. వాడకపోయినా వెనకాల ఇవి అలాగే రన్‌ అవుతుంటే బ్యాటరీని ఖర్చు చేస్తాయని, ఎక్కువ డేటా తీసుకుంటాయని, ఫోన్‌ వేగం తగ్గుతుందని భావిస్తుంటాం. ఆండ్రాయిడ్‌ ఫోన్ల విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ. యాప్స్‌ పనిచేయటానికి ఆండ్రాయిడ్‌ను రూపొందించిన తీరు గురించి తెలిస్తే ఇది నిజమేనని అంగీకరించక తప్పదు.

బ్యాక్‌గ్రౌండ్‌ మెమరీలో యాప్స్‌ ఉండే విధంగానే ఆండ్రాయిడ్‌ను రూపొందించారు. అంతేకాదు, అవసరమైనప్పుడు తనకు తానే యాప్స్‌ను క్లోజ్‌ చేసుకునేలా తయారుచేశారు కూడా. అందువల్ల మనం పని గట్టుకొని క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌ ఉండటం వల్ల మరో ప్రయోజనం ఓపెన్‌ చేసినప్పుడు అవి త్వరగా లాంచ్‌ అవుతాయి. బ్యాటరీని ఎక్కువగా వాడుకోకుండానే పనిచేస్తాయి.

సీపీయూపై భారం

అదే తరచూ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తూ, ఓపెన్‌ చేస్తున్నట్టయితే తిరిగి మొదట్నుంచీ పని ఆరంభించాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ బ్యాటరీని తీసుకుంటాయి. ఇది సీపీయూ మీదా భారం పడేలా చేస్తుంది. అలాగని యాప్స్‌ను ఎన్నడూ క్లోజ్‌ చేయకూడదని కాదు. సరిగా పనిచేయకపోతున్నా, ఏదైనా లోడ్‌ కావటానికి ఎక్కువసేపు పడుతున్నా, అసలు పనిచేయటానికే మొరాయిస్తున్నా యాప్‌ను క్లోజ్‌ చేయక తప్పదు. ఫోన్‌ను రీస్టార్ట్‌ చేస్తే ఇంకా మంచిది. రీసెంట్‌ యాప్స్‌ పద్ధతితోనే కాదు.. సెటింగ్స్‌లోని యాప్స్‌ విభాగంలోకి వెళ్లి ఫోర్స్‌ స్టాప్‌, ఫోర్స్‌ క్లోజ్‌ ఆప్షన్ల ద్వారానూ యాప్స్‌ను క్లోజ్‌ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: Gmail Confidential Mode: ఆండ్రాయిడ్​ ఫోన్​తో 'సీక్రెట్​ మెయిల్స్'​ పంపేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.