ETV Bharat / science-and-technology

వాటర్‌ప్రూఫ్‌ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేదెప్పుడో? - ఛార్జింగ్‌ పోర్టులు

waterproof phones: చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేనిదే రోజు గడవని కాలమిది. సెల్ఫీ తీసుకుంటున్నప్పుడో, చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడో.. నాజూకైన ఫోన్లు చేతిలోంచి చటుక్కున జారి నీళ్లలో పడటం సర్వ సాధారణం. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో వాటర్​ప్రూఫ్ ఫోన్లు ఎప్పుడొస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది.

waterproof phones
వాటర్‌ప్రూఫ్‌ మొబైల్ ఫోన్లు
author img

By

Published : Jul 7, 2022, 12:35 PM IST

waterproof phones: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మోడళ్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన చరవాణులు మార్కెట్లోకి వస్తున్నా.. నీటిలో పడగానే ఇట్టే మూగబోతున్నాయి. అసలు నీటి నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే 'వాటర్‌ప్రూఫ్‌' మొబైల్‌ ఫోన్లను ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నది ఇంకా సమాధానం వెతకాల్సిన సవాలుగానే మిగిలిపోయింది. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్లు నీటిని వికర్షించేలా (వాటర్‌-రిపెల్లింగ్‌) చేయడంలో ఉత్పత్తిదారులు కొంతవరకూ విజయం సాధించారు. నీరు సులభంగా చొరబడని (వాటర్‌-రెసిస్టెంట్‌) ఫోన్లను తీసుకురాగలిగారు. అలాగని ఇవేమీ ఫోన్‌ లోపలికి నీరు చేరకుండా 100% అడ్డుకోలేకపోతున్నాయి. నీటిలో పూర్తిగా మునిగిపోయే సందర్భాల్లో చాలామటుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించే వాటర్‌ప్రూఫ్‌ చరవాణుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

తప్పుడు ప్రచారానికి భారీ జరిమానా: తమ ఫోన్లు నీటిలోనూ భేషుగ్గా పనిచేస్తాయంటూ తప్పుడు ప్రచారం చేసిన ఓ దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థకు ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు గతవారం సుమారు రూ.75 కోట్ల (14 మిలియన్‌ డాలర్ల) జరిమానా విధించింది. సముద్రపు నీటిలో పడితే, తమ ఫోన్లలోని ఛార్జింగ్‌ పోర్టులు తుప్పు పడతాయని, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్‌ పెడితే పాడవుతాయని ఆ సంస్థ నిజం వెల్లడించింది.

waterproof phones
వాటర్‌ప్రూఫ్‌ మొబైల్ ఫోన్లు

ఆ రేటింగ్‌ను ఎలా కొలుస్తారు?: ఇంగ్రెస్‌ ప్రొటెక్షన్‌ (ఐపీ) అనే రేటింగ్‌ సిస్టం ద్వారా.. ఫోన్లు ధూళి వంటి ఘన పదార్థాలు, నీరు వంటి ద్రవపదార్థాలను వికర్షించే గుణాన్ని కొలుస్తారు. రెండు సంఖ్యలతో ఈ రేటింగ్‌ను సూచిస్తారు. 'ఐపీ68'ను తీసుకుంటే, ఇందులో ఎడమవైపు సంఖ్య ఘన పదార్థాల నుంచి, కుడివైపు సంఖ్య ద్రవ పదార్థాల నుంచి కల్పించే రక్షణ స్థాయులకు సూచన. ఈ సంఖ్యలు 0 (నో ప్రొటెక్షన్‌) నుంచి 6/8 (హై ప్రొటెక్షన్‌) వరకూ రేటింగ్‌ను సూచిస్తాయి. అయితే ఇవి కేవలం ప్రయోగశాల పరీక్ష ఫలితాలను అనుసరించి నిర్ధరించినవే.

నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలంటే?: ఫోన్లు ధూళిని, నీటిని వికర్షించాలంటే.. వాటి ఛార్జింగ్‌ పోర్టులు, బటన్లు, స్పీకర్లు, కెమెరా, ఫ్లాష్‌, మైక్రోఫోన్‌, సిమ్‌కార్డు ట్రే, యూఎస్‌బీ పోర్టులు ఉన్నచోట పూర్తిగా మూసెయ్యాలి. ఇందుకు గ్లూ, టేపు, సిలికాన్‌ సీల్‌, రబ్బర్‌ రింగ్‌, గ్యాస్కెట్‌, ప్లాస్టిక్‌ మెష్‌ వంటి పదార్థాలను వినియోగించాలి. కొంతవరకూ ఇలా చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే. స్మార్ట్‌ఫోన్‌లోని భాగాలన్నీ ఎంతో సున్నితమైనవి. పెళుసుగా ఉంటాయి. అత్యంత నాజూకైన పెట్టెల్లో వీటిని అమర్చాలి. నీటిని పూర్తిగా వికర్షించేలా రూపొందించాలంటే.. వీటి పరిమాణం పెరుగుతుంది. ధర కూడా 30% వరకూ ఎక్కువవుతుంది. ఒకవేళ ఫోన్‌కి చిన్నపాటి బీట వచ్చినా, ఇక దానికి రక్షణ లేనట్టే!

ప్రయోగాలు ఫలించవచ్చు..: "లేజర్‌ రైటింగ్‌ సాంకేతికతతో సర్క్యూట్‌ వంటి లోపలి పరికరాలతో పాటు బయటి భాగాలకూ సిలికాన్‌, వాటర్‌-రెసిస్టెంట్‌ పూతను వేయడం ద్వారా ఫలితం ఉండొచ్చు. దీనిపై జరుగుతున్న ప్రయోగాలు ఫలించే అవకాశముంది. ఒకవేళ మీ ఫోన్‌ నీటిలో పడిపోతే వెంటనే దాన్ని బయటకు తీసి, పూర్తిగా ఆరనివ్వాలి. అప్పటివరకూ ఛార్జింగ్‌ పెట్టకూడదు. వాటర్‌ప్రూఫ్‌ పౌచ్‌ను వినియోగించడం మేలు" అని ఆస్ట్రేలియాలోని సీక్యూ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రితేశ్‌ చుగ్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ఫోన్​లో యాప్స్ ఇన్‌స్టాల్ కావట్లేదా?.. ఇలా చేస్తే సెట్!

మీ లొకేషన్​ ట్రాక్ చేస్తున్నాయని ఆ యాప్స్​పై డౌటా? ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.