WhatsApp New Features 2023 : వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది దాని మాతృసంస్థ మెటా. యూజర్లు స్వయంగా స్టిక్కర్లను, ఇమేజ్‌లను క్రియేట్ చేసేకునే విధంగా సరికొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఇది ఏఐ ఆధారంగా పనిచేస్తుందని తెలిపింది. దాంతోపాటు చాట్‌బాట్, న్యూ సెర్చ్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఏఐ స్టిక్కర్లు..
WhatsApp AI Stickers : స్టిక్కర్లు క్రియేట్ చేసేవారి కోసం.. వాట్సాప్ అదిరిపోయే ఫీచర్ తీసుకురానుంది. దీంతో ఇక సొంతంగానే వాట్సాప్ స్టిక్కర్లను యూజర్లు క్రియేట్ చేయవచ్చు. దీని కోసం వాట్స్ప్లోని స్టిక్కర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం క్రియట్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సెర్చ్ బార్ వస్తుంది. అందులో మీకు నచ్చిన స్టిక్కర్లను సొంతంగానే క్రియేట్ చేయవచ్చు. వచ్చే నెలలోనే ఈ ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ పేర్కొంది.
ఏఐ ఇమేజ్ ఫీచర్..
WhatsApp AI Image : ఏఐ స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేస్తామో.. ఏఐ ఇమేజ్‌లను కూడా అలాగే క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇమేజ్‌ల కోసం ప్రత్యేకంగా సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదని వాట్సాప్ ప్రకటించింది. ఏఐ స్టిక్కర్లను క్రియేట్ చేసినట్లుగానే వీటిని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే క్రియేట్ సెర్చ్ బార్లో @ Meta AI అని టైప్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ పేరును ఎంటర్ చేయాలి. దీంతో మీరు కోరుకున్న ఇమేజ్ ప్రత్యక్షమవుతుంది.
వాట్సాప్‌లోనే మెటా ఏఐ చాట్‌బాట్..
WhatsApp Chatbot Feature : వాట్సాప్‌లో కూడా ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేయబోతుంది మెటా సంస్థ. ఆ చాట్బాట్లో @ meta AI అని టైప్ చేసి మీకు కావల్సిన సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది.
కొత్త సెర్చ్ ఫీచర్..
WhatsApp New Search Bar Feature : వాట్సాప్‌లో అప్డేటేడ్ సెర్చ్ ఫీచర్ తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది వాట్సాప్. ప్రస్తుతం వాట్సాప్ అప్డేట్ ట్యాబ్‌లో ఛానల్స్, స్టేటస్‌లను సెర్చ్ చేసేందుకు వీలుకావడం లేదు. అయితే రానున్న అప్డేట్లో ఈ సమస్య తీరనుందని మోటా సంస్థ ప్రకటించింది. దీంతో సులువుగా వాట్సాప్ ఛానల్స్, స్టేటస్ అప్డేట్స్ సెర్చ్ చేయవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఓ స్క్రీన్‌షాట్ సైతం విడుదల చేసింది మెటా సంస్థ.
ChatGPT Latest Features : వావ్.. చాట్‌జీపీటీ ఇప్పుడు వింటుంది, మాట్లాడుతుంది, చూస్తుంది కూడా!