ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్​లో వాట్సాప్ స్టేటస్​లు.. ఒక్క క్లిక్​తోనే పోస్ట్.. ఇలా చేస్తే.. - వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ఫీచర్

వాట్సాప్​లో రెండు అదిరిపోయే ఫీచర్లు రానున్నాయి. ఫేస్​బుక్​లో వాట్సాప్ స్టేటస్​లు ఆటోమెటిక్​గా అప్​లోడ్ అయ్యేలా కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది మెటా. మరోవైపు వాట్సాప్​ ఇంటర్​ఫేస్​లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

whatsapp-new-features-2023
వాట్సాప్ కొత్త అప్‌డేట్ 2023
author img

By

Published : Apr 8, 2023, 5:18 PM IST

మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ అండ్​ కాలింగ్​ యాప్​ వాట్సాప్​లో అదిరిపోయే ఫీచర్​ రానుంది.​ స్టేటస్​ అప్​లోడ్​ చేస్తే.. ఒకేసారి వాట్సాప్​తో పాటు ఫేస్​బుక్​లోనూ పోస్ట్​ అయ్యే విధంగా కొత్త ఫీచర్​ను తీసుకువచ్చేందుకు మెటా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్​పై సంస్థ ప్రయోగాలు నిర్వహిస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిని యూజర్లకు అందుబాటులో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

"ప్రస్తుతం వాట్సాప్​లోగానీ, ఫేస్​బుక్​లోగానీ ఏదైన స్టేటస్​ అప్​లోడ్​ చేయాలంటే వేరు వేరుగా చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకే స్టేటస్​ను రెండుసార్లు పోస్ట్​ చేయాలంటే వినియోగదారులకు చిరాకుగా ఉంటుంది. అందుకే ఈ కొత్త ఫీచర్​ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. వాట్సాప్​ స్టేటస్​ అప్​డేట్​ను సులభతరం చేయాలన్నదే మా లక్ష్యం" అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని ప్రకారం ఏదైన స్టేటస్​.. వాట్సాప్​లో అప్​లోడ్​ చేస్తే అది ఆటోమెటిక్​గా ఫేస్​బుక్​లోనూ షేర్ అయిపోతుంది.

ఈ కొత్త ఫీచర్​ ఆప్షన్​ సదుపాయాన్ని పొందాలంటే.. ప్రైవసీ సెట్టింగ్​లోకి వెళ్లి, వినియోగదారుల ఫేస్​బుక్​ ఖాతాను జత చేసుకుంటే సరిపోతుంది. దీంతో​ ఒకేసారి వాట్సాప్​లోనూ, ఫేస్​బుక్​లోనూ.. స్టేటస్ అప్​లోడ్​ అవుతుంది. కొత్త ఫీచర్​తో వినియోగదారుల సమయం వృథా కాదని, ఒకే స్టేటస్​ను రెండుసార్లు అప్​డేట్​ చేయాల్సిన అవసరం ఉండదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

వాట్సాప్​ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు..
స్టేటస్​తో పాటు వాట్సాప్ ఇంటర్​ఫేస్​లో కీలక మార్పులు చేసేందుకు సంస్థ సిద్ధమైంది. వాట్సాప్ నావిగేషన్ బార్​లో ఈ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం వాట్సాస్​ యాప్​లో పైన కనిపించే నావిగేషన్ బార్​లు కిందకి రానున్నాయి. ఈ అప్​డేట్​ ఇంకా టెస్టింగ్​ స్టేజ్​లోనే ఉంది. ఈ కొత్త అప్​డేట్​​ బీటా టెస్టర్​లకు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత దీన్ని తొలుత బీటా టెస్టర్లకు, ఆ తర్వాత సాధారణ యూజర్లకు అందుబాటులోకి తేనుంది వాట్సాప్.

"కొంత కాలంగా వాట్సాప్​ ఇంటర్​ఫేస్​ను రీడిజైన్​ చేయమని వినియోగదారులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్​ఫేస్​.. అవుట్​డేట్​గా వారు భావిస్తున్నారు. మారిన ఆండ్రాయిడ్​ అప్​డేట్​లకు అనుగుణంగా.. వాట్సాప్​ ఇంటర్​పేస్​ లేదని చెబుతున్నారు. ఐఓఎస్​ యాప్‌లానే చాట్‌లు, కాల్‌లు, కమ్యూనిటీలు, స్టేటస్ వంటి ముఖ్యమైన ఫీచర్‌లను సులభంగా, వేగంగా యాక్సెస్ చేయడానికి వాట్సాప్​లో మార్పులు కావాలని వినియోగదారులు కోరుతున్నారు. యాప్‌ను నావిగేట్ చేయడానికి మరింత ఆధునిక, స్పష్టమైన మార్గాన్ని వినియోగదారులు కోరుతున్నారు" అని వాట్సాప్​ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారుల కోరిక మేరకే వాట్సాప్​ ఇంటర్​ఫేస్​లో మార్పులు జరుపుతున్నట్లు వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే వాట్సాప్​ కొత్త ఆండ్రాయిడ్​ వెర్షన్​ అప్​డేట్​ను తీసుకువస్తామని వారు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.