ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో మరో అదిరే ఫీచర్​​.. మెసేజ్​లో తప్పులు ఉంటే ఇక ఈజీగా...

WhatsApp Edit Message Feature: ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఒకసారి పంపిన మెసేజ్​లను మళ్లీ ఎడిట్​ చేసుకునే వెసులుబాటును వాట్సాప్ పరీక్షిస్తోంది.

WhatsApp may soon let you edit messages after sending them

author img

By

Published : Jun 1, 2022, 3:19 PM IST

WhatsApp Edit Message Feature: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ గల మెసెంజర్​ వాట్సాప్​​. మిగతావాటితో పోలిస్తే వాట్సాప్​ సంభాషణ చాలా సురక్షితం. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ఫీచర్​ వల్ల మన సందేశాలు ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. వాట్సాప్​ తమ వినియోగదారుల కోసం త్వరలో ఎడిట్​ ఆప్షన్​ అనే కొత్త ఫీచర్​ తీసుకురానున్నట్లు తెలిసింది. అంటే ఒకసారి పంపిన మెసేజ్​ను మళ్లీ ఎడిట్​ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నట్లు తెలిపిన వాట్సాప్‌ బీటా ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో.. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

మెసేజ్​ చేసినప్పుడు అందులో అక్షర దోషాలున్నా సరిచేసుకోవడానికి, సరైన సమాచారం పంపలేదని అనిపించినప్పుడు ఇప్పటివరకు మళ్లీ పంపించడం, లేదా పంపిన సందేశం డిలీట్​ చేయడం వంటివి చేస్తుంటారు యూజర్లు. ఇక కొత్త సదుపాయంతో.. ఆ ఇబ్బందులు తప్పుతాయి. మెసేజ్​ డిలీట్​ చేయకుండానే.. పంపిన సందేశాన్నే ఎడిట్​ చేసి పంపొచ్చు. ఇప్పటికే టెలిగ్రామ్​లో ఈ ఫీచర్​ ఉంది. ఇప్పుడు వాట్సాప్​లోకి రానుంది.

WhatsApp may soon let you edit messages after sending them
వాట్సాప్​లో కొత్త ఫీచర్​
నిజానికి వాట్సాప్​ ఐదేళ్ల క్రితమే ఈ ఫీచర్​ను పరీక్షించి, ఆ తర్వాత వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. మళ్లీ ఇన్నాళ్లకు అదే ఎడిట్​ మెసేజ్​ బటన్​పై పనిచేస్తోంది. అయితే.. ఎడిట్​ చేసినట్లు అవతలి వ్యక్తికి తెలుస్తుందా అంటే అవకాశమే లేదని చెబుతోంది డబ్ల్యూఏబీటాఇన్ఫో. ప్రస్తుతానికి సాధారణ మెసేజ్​లానే కనిపిస్తుందని పేర్కొంది. అయితే.. ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి: మీ వాట్సాప్ చాట్ వేరేవాళ్లు చూస్తున్నారా? ఎలా తెలుసుకోవాలి?

మీ ఫొటోతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. ఇలా తయారు చేసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.