ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ వినియోగదారునికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్(WhatsApp). గతకొన్నేళ్లుగా యూజర్ కమ్యూనికేషన్ సులభతరం చేసేందుకు ఎమోజీలు, జిప్ ఫైల్స్, స్టిక్కర్ల వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్(WhatsApp updates).. అవతలి వ్యక్తి మెసేజ్‌లకు డైరెక్ట్‌గా రిప్లే ఇచ్చేందుకు ఫేస్‌బుక్ తరహా 'రియాక్షన్ ఫీచర్'(message reactions feature)ను అందుబాటులో తీసుకురానుంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ స్క్రీన్ షాట్స్ కొన్నింటిని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో(వాబీటాఇన్ఫో) షేర్ చేసింది.
ఇదివరకే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తీసుకొచ్చిన మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను.. ఇప్పుడు వాట్సాప్‌కు సైతం ప్రవేశపెట్టబోతోంది. ఇది ఫేస్‌బుక్ రియాక్షన్ ఫీచర్ తరహాలో ఉండొచ్చని వాబీటాఇన్ఫో అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ యూజర్‌కు అందుబాటులో రానుందని.. యాప్ అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు వినియోగించుకోవచ్చని వాబీటాఇన్ఫో చెబుతోంది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నిహితులు, స్నేహితులకు మెసేజ్ చేసినప్పుడు.. మెసేజ్ టాబ్ మీద క్లిక్ చేయగానే నవ్వు, బాధ, థంబ్స్అఫ్ వంటి ఎమోజీ రియాక్షన్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటి ద్వారా యూజర్ డైరెక్ట్‌గా మెసేజ్ చేయవచ్చు.
ఇదీ చూడండి: Whatsapp update : వాట్సాప్‌లోని ఆ ఫీచర్లలో మార్పులు!