WhatsApp Ban Accounts: కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే భారత్‌లో 16.6లక్షల ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. గత కొంత కాలంగా ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించే యూజర్లపై చర్యలు తీసుకొంటున్న ఈ సంస్థ.. తాజాగా ఏప్రిల్ మాసానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్‌లో 844 ఫిర్యాదులు గ్రీవెన్స్ సెల్‌కు రాగా.. 123 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అదే మార్చిలో 597 ఫిర్యాదులు రాగా.. 74 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
'వినియోగదారుల భద్రతా నివేదికలో యూజర్ల ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను పొందుపరుస్తాం. వీటితోపాటు ఈ వేదికపై నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని ఎప్పటికప్పుడు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలో గ్రివెన్స్ సెల్‌కు ఏప్రిల్ మాసంలో 844 ఫిర్యాదులు అందగా.. వాటిలో 123 అకౌంట్లపై చర్యలు తీసుకున్నాం. వీటితోపాటు వాట్సాప్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వేదికలో ఉండే స్వతంత్ర నివారణ చర్యల ద్వారా లక్షల అకౌంట్లపై నిషేధం విధిస్తున్నాం' అని తాజా నివేదికలో వాట్సాప్ పేర్కొంది.
కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి 30 వరకు వాట్సాప్ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ తెలిపింది.
ఇదీ చూడండి: వాట్సాప్‌లో మరో అదిరే ఫీచర్.. మెసేజ్‌లో తప్పులు ఉంటే ఇక ఈజీగా...