ETV Bharat / science-and-technology

Apple Mega Event 2021: మెగా ఈవెంట్​కు 'యాపిల్' రెడీ - apple mac

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా మెగా ఈవెంట్​కు 'యాపిల్' సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం జరగనుంది. మరి అందులో ఏయే ప్రొడక్ట్స్ విడుదల చేస్తారు? తదితర విశేషాలు మీకోసం.

Apple Mega Event 2021
యాపిల్
author img

By

Published : Sep 13, 2021, 9:10 PM IST

ఏటా యాపిల్‌ కంపెనీ సెప్టెంబర్‌ - అక్టోబర్‌ నెలల మధ్య పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా గతేడాది నుంచి ఈవెంట్‌ను వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తమ కంపెనీ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈసారి కూడా యాపిల్ 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌' పేరుతో సెప్టెంబరు 14 రాత్రి 10:30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) పెద్ద ఆన్‌లైన్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇందులో యాపిల్ తర్వాతి తరం ఐఫోన్ మోడల్‌ ఐఫోన్ 13తోపాటు మరికొన్ని ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ యాపిల్‌ తీసుకొస్తున్న కొత్త ఉత్పత్తులు ఏంటి? ఐఫోన్ 13లో ఎన్ని మోడల్స్‌ రానున్నాయనేది చూద్దాం.

apple iphone 13
యాపిల్ ఐఫోన్ 13

ఐఫోన్ 13

యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ మోడల్‌ను ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్‌ అనే నాలుగు వేరియంట్లలో తీసుకొస్తుందని తెలుస్తోంది. వీటిలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఎల్‌పీవో డిస్‌ప్లే ఇస్తున్నారట. అలానే ఐఫోన్ 13 మినీలో 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 13, 13 ప్రో వేరియంట్లో 3,095 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో 4,352 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 25 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందట. ఈ ఫోన్లు శాటిలైట్‌ కాలింగ్‌ ఫీచర్‌తో రానున్నాయని యాపిల్ ఉత్పత్తుల విశ్లేషకుడు మింగ్ చి కువో వెల్లడించారు. దాదాపు 1TB స్టోరేజీతో ఐఫోన్‌ 13 రాబోతున్నట్లు మింగ్ తెలిపారు.

ఐఫోన్‌ 13 ముందు భాగంలో డాట్‌ ప్రొజెక్టర్‌తో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను ఒకే మాడ్యూల్‌గా ఇవ్వనున్నారట. దీని వల్ల ఫోన్ ముందు భాగంలో నాచ్‌ సైజ్‌ తగ్గనుంది. ఐఫోన్ 12 సిరీస్‌ ఫోన్లలో యాపిల్ యూఎస్‌బీ కేబుల్‌, టచ్‌ ఐడీ ఇవ్వలేదు. ఐఫోన్ 13 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 13, 13 ప్రోలో 6.1 అంగుళాలు, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. నాలుగు వేరియంట్లలో యాపిల్ ఏ15 ప్రాసెసర్ ఉపయోగించారని సమాచారం. వీటితోపాటు అండర్ డిస్‌ప్లే కెమెరా, ఫేస్‌ఐడీ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

యాపిల్ వాచ్‌ సిరీస్‌ 7

యాపిల్‌ వాచ్‌లో కొత్త మోడల్‌ను ఈ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఇందులో ఐపాడ్ ప్రో, ఐఫోన్ 12 డివైజ్‌లను పోలిన ఫ్లాటర్‌ ఎడ్జ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. వీటి డిస్‌ప్లే సైజ్ 41 ఎమ్‌ఎమ్‌ నుంచి 45 ఎమ్ఎమ్‌ మధ్య ఉంటుందని సమాచారం. అంటే గత వాచ్‌ డిస్‌ప్లేలతో పోలిస్తే వాచ్‌ సిరీస్‌ 7 డిస్‌ప్లే కాస్త పెద్దదిగా ఉంటుందని అంచనా. అలానే వాచ్‌ సిరీస్ 7లో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇందులో కొత్తగా బ్లడ్ షుగర్ మానిటరింగ్ ఫీచర్‌తోపాటు బాడీ టెంపరేచర్ సెన్సర్స్ ఇస్తున్నారట.

Apple watch 7
యాపిల్ వాచ్ 7

యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ 3

మార్కెట్లో ఎన్ని రకాల టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్ ఉన్నా ఎయిర్‌పాడ్స్ ప్రత్యేకత వేరు. అయితే అవి పాత మోడల్‌ కావడం వల్ల యాపిల్‌ కొత్తగా ఎయిర్‌పాడ్స్‌ 3 మోడల్‌ను రేపు జరిగే ఈవెంట్లో విడుదల చేయనుందట. వీటిలో సౌండ్, డిజైన్ పరంగా కీలక మార్పులు చేసినట్లు సమాచారం. అలానే సిలికాన్ ఇయర్‌స్ట్రిప్స్ లేకుండానే వీటిని తీసుకొస్తున్నారట. నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండదని తెలుస్తోంది. యాపిల్ గతంలో విడుదల చేసిన ఎయిర్‌పాడ్ ప్రో, ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ మోడల్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇవ్వలేదు.

apple ear buds
యాపిల్ ఎయిర్​బడ్స్

మరి ఐపాడ్‌, మ్యాక్‌ల సంగతేంటి?

యాపిల్ ఈ ఏడాదే కొత్త మోడల్‌ ఐపాడ్‌, మ్యాక్ కంప్యూటర్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే మంగళవారం(సెప్టెంబరు 14) జరగబోయే ఈవెంట్‌లో వీటి ప్రస్తావన ఉండకపోవచ్చంటున్నాయి టెక్ వర్గాలు. ఐపాడ్‌ విడుదలకు సంబంధించి యాపిల్ నవంబర్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఐపాడ్ మినీ, ఐపాడ్ ఎయిర్ 4 పేరుతో కొత్త మోడల్స్‌ తీసుకొస్తున్నారట. వీటిలో యాపిల్ ఏ13 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఐపాడ్ మినీలో 8.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. ఐపాడ్‌లతోపాటే మ్యాక్‌ బుక్‌లను విడుదల చేయనున్నారు. కొత్త మ్యాక్‌బుక్‌ ప్రో ల్యాప్‌టాప్‌ని 14 లేదా 16 అంగుళాల మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారట. ఇందులో మ్యాగ్నటిట్‌సేఫ్‌ ఛార్జర్, ఎస్‌డీ కార్డ్ స్లాట్, థండర్ బోల్ట్, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు ఇస్తున్నారని సమాచారం.

apple mac book
యాపిల్ మ్యాక్​ బుక్, ట్యాబ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.