ETV Bharat / science-and-technology

What Not to Do on Your Office Computer : ఆఫీస్​ ఫోన్​, కంప్యూటర్ వాడుతున్నారా?.. ఈ పనులు అస్సలు చేయకండి!

What Not to Do on Your Office Computer : కంపెనీలు తమ ఉద్యోగులకు ఫోన్స్​, కంప్యూటర్స్ ఇస్తాయి. వీటిని కేవలం తమ ఆఫీస్ వర్క్​ కోసం మాత్రమే ఉపయోగించాలని సదరు కంపెనీలు ఆశిస్తాయి. కానీ చాలా మంది వీటిని తమ వ్యక్తిగత అవసరాలకు, పనులకు వాడుకుంటూ ఉంటారు. దీని వల్ల వాళ్లు తెలియకుండానే రిస్క్​లో పడతారు. మరి మీరు కూడా ఆఫీస్ కంప్యూటర్​, ఫోన్ వాడుతున్నారా? అయితే వాటిలో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి!

things you should never do on a company phone
What Not to Do on Your Office Computer
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 12:43 PM IST

What Not to Do on Your Office Computer : కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆ సంస్థ తరఫున సెల్​ఫోన్లు ఇస్తాయి. ఎలాగో ఫ్రీ కదా అనుకుని ఎలా పడితే అలా వాడేస్తుంటాం. కంప్యూటర్లు, ల్యాప్​టాప్స్​ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఉచిత ఇంటర్నెట్ దొరికిందికదా అని మన వ్యక్తిగత వెబ్​సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి చూస్తాం. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నప్పుడు కంపెనీ వాళ్లు చూడరు కదా అనుకుని ఇష్టం వచ్చినట్లు వాటిని వాడేస్తూ ఉంటాం. కానీ.. కంపెనీకి చెందిన డివైజ్​లు వారి పర్యవేక్షణలో ఉంటాయని మీకు తెలుసా ? మీ డివైజ్​లో ఒక వేళ మానిటరింగ్ సాఫ్ట్​వేర్ లేకపోయినా.. మీరు చేసే పనిని యాక్సెస్ చేయడానికి షేర్డ్ సర్వీస్​లు ఉంటాయి. వీటిని కంపెనీ ఉన్నతాధికారులు లేదా IT నిపుణులను చూస్తూ ఉంటారు. మీరు కనుక కంపెనీ ఫోన్లు లేదా కంప్యూటర్లను సొంత అవసరాలకు వాడినట్లైతే .. మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అందువల్ల కంపెనీ సెల్​ఫోన్, కంప్యూటర్​లో ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి.

1. వ్యక్తిగత పనులు చేయవద్దు!
వ్యక్తిగత కార్యకలాపాల కోసం మీ కంపెనీ ఇచ్చిన ఫోన్, కంప్యూటర్​ని ఉపయోగించకండి. వ్యక్తిగత కాల్స్, మెసేజెస్ చేయడం లేదా ఈ-మెయిల్స్ పంపడం లాంటివి చేయవద్దు. అలాగే సోషల్ మీడియా వినియోగం సహా, వ్యక్తిగత అవసరాలకు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయకండి.

2. వ్యక్తిగత ఫొటోలు వద్దు!
కంపెనీ ఫోన్​తో ఫొటోలు తీయడం, దిగడం మానుకోండి. ఒక వేళ మీరు వాటిని డిలీట్ చేసినప్పటికీ.. ఆటోమేటిక్ బ్యాకప్ వల్ల క్లౌడ్​లోకి అప్​లోడ్​ అవుతాయి. వీటిని మరొకరు చూసే అవకాశముంది. కొన్ని సార్లు వీటిని దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది.

3. పర్సనల్ ఫైల్స్ ఉంచకండి!
ఆఫీస్​ వర్క్ కోసం ఇచ్చిన కంప్యూటర్ లేదా ల్యాప్​టాప్​లో మీ వ్యక్తిగత ఫైల్స్​ని ఉంచకండి. ఒక వేళ మీరు జాబ్ కోల్పోతే వెంటనే వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఫైల్స్​ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. పైగా జాబ్ విషయంలో ఏమైనా చట్టపరమైన పోరాటం జరిగితే.. ఈ అంశం మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది.

4. సెర్చ్ హిస్టరీపై అప్రమత్తంగా ఉండండి!
గూగుల్ లేదా ఇతర సెర్చ్ హిస్టరీపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి వీటిల్లో వెతక్కపోవడమే మంచిది. ఎందుకంటే సెర్చ్ హిస్టరీ అనేది కంప్యూటర్​లో అత్యంత సులభంగా యాక్సెస్ చేయగల వాటిలో ఒకటి.

5. ప్రైవేటు సంభాషణలకు నో చెప్పండి
కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ప్రైవేట్ చాట్​లను ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆఫీస్​ ల్యాప్​టాప్​లో ప్రైవేటు చాట్​లు చేయవద్దు. అలాగే వాటిలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు.

6. సొంత ఈ-మెయిల్ వినియెగం వద్దు!
కొంత మంది కంపెనీల కంప్యూటర్లలో సొంత ఈ-మెయిల్​తో లాగిన్ అయ్యి.. వర్క్ చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. కంపెనీలకు సంబంధించిన ఈ-మెయిల్స్​ మాత్రమే ఉపయోగించాలి. లేదంటే, ప్రత్యేకంగా కంపెనీ కోసం మాత్రమే ఒక ఈ-మెయిల్​ క్రియేట్ చేసుకోవాలి.

7. పర్సనల్ సమాచారం షేర్డ్ సర్వర్లలో పెట్టకూడదు
మీరు ఆఫీస్​ ల్యాప్​టాప్​తో పనిచేయకపోయినప్పటికీ.. G-సూట్ లాంటి సర్వర్లు కంపెనీ ఈ-మెయిల్​లకు లింక్ చేసి ఉంటాయి. ఇవి డ్రైవ్, గూగుల్ డాక్స్, షీట్స్​ని యాక్సెస్ చేసే వీలుంటుంది.

8. లాక్ చేయడం మర్చిపోకండి
మీరు ఆఫీసులో ఉన్నా, పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినా.. ల్యాప్​టాప్​ని లాక్ చేయడం మర్చిపోకండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని ఇతరులకు ఇచ్చినట్లే అవుతుంది. ( Things You Should Never Do On A Company Computer )

9. పబ్లిక్​లో జాగ్రత్త!
పబ్లిక్ ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో ఎవరైనా మీ స్క్రీన్​ను గమనించవచ్చు. ఫ్రీ వై-ఫై ఉపయోగించే విషయంలోనూ చాలా కేర్​ఫుల్​గా ఉండాలి. పబ్లిక్ వై-ఫై ఉపయోగించే సమయాల్లో వీపీఎన్ వాడాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

10. అసభ్యకరమైన కంటెంట్​కు దూరంగా ఉండాలి
కంపెనీ కంప్యూటర్, ల్యాప్​టాప్​లో అనుచితమైన, అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ చూడకూడదు. వర్క్ పిరియడ్​లో మాత్రమే కాదు.. ఖాళీ సమయాల్లోనూ వీటిని చూడకూడదు. ఇలాంటి వాటికి మీ వ్యక్తిగత డివైజ్​లను మాత్రమే ఉపయోగించడం మేలు.

11. సొంతదానిలా పరిగణించకండి!
కంపెనీ ఇచ్చిన డివైజ్​లను మీ సొంత వాటిలా పరిగణించవద్దు. అందులో మార్పులు, చేర్పులు చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా వాటి సెక్యూరిటీ కాన్ఫిగరేషన్​లను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రయత్నం చేయకూడదు.

12. ఆందోళన వద్దు
వాస్తవానికి మీరు ఉపయోగిస్తున్న ఆఫీస్ డివైజ్​లపై.. కంపెనీ నిఘా ఉంటుందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. వీటితో బిల్లులు చెల్లించడం, బ్యాంకు ఖాతా యాక్సెస్ చేసుకోవడం లాంటి పనులు చేయవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. కానీ వీలైనంత వరకు ఆ పనులు కూడా చేయకుండా ఉండడం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.