ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌తో వినియోగదారుల్ని పలకరించడం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'వివో'కు అలవాటే. తాజాగా ఇదే విధంగా ఓ కొత్త మొబైల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మరి ఈ వివో వై53ఎస్ ధర, ఫీచర్లు ఏంటో చూసేయండి..
ఫీచర్స్(Vivo Y53S specification):-
- 6.58-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్- వాటర్‌డ్రాప్ నాచ్
- 1080X2408 పిక్సెల్స్ హెచ్డీ+ రిసొల్యూషన్
- మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్
- ట్రిపుల్ రేర్ కెమెరా(64ఎంపీ+2ఎంపీ+2ఎంపీ), 16ఎంపీ సెల్ఫీ కెమెరా.
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్
- డ్యుయెల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్టే, బ్లూటూత్ 5.0, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ
ధర(Vivo Y53S price in India)..
భారత్‌లో వీవో వై53ఎస్ ధర.. రూ. 19,490గా ఉంది. ఇది డీప్ సీ బ్లూ, రెయిన్బో రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బజాజ్ ఈఎమ్ఐ స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఈ వీవో వై53ఎస్పై ఆఫర్లు కూడా ఉన్నాయి! హెచ్డీఎఫ్సీ డెబిట్/ క్రెడిట్ కార్డులు, ఐసీఐసీఐ క్రెడిట్/ డెబిట్ కార్జులు, కొటాక్ మహీంద్ర బ్యాంక్ మీద 1,500 క్యాష్‌బ్యాక్ ఉంది.
ఇదీ చూడండి:- ఆగస్టులో మార్కెట్లోకి వచ్చే స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!