ETV Bharat / science-and-technology

రెడ్​ సిగ్నల్ జంప్.. ఖాళీ రోడ్డుపై సడెన్ బ్రేక్.. చుక్కలు చూపిస్తున్న టెస్లా కార్లు! - టెస్లా కార్ల సమస్యలు

Tesla Malfunction: "రెడ్ సిగ్నల్​ పడినా ఆగడం లేదు.. ఖాళీ రోడ్డుపై వేగంగా వెళ్తూ ఒక్కసారిగా బ్రేక్ వేస్తోంది".. టెస్లా ఆటో పైలట్​ కార్లపై ఇటీవల బాగా వినిపిస్తున్న ఫిర్యాదులివి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల్లో కింగ్​గా పేరుగాంచిన టెస్లాలో ఎందుకీ సమస్యలు? ఆటో పైలట్​ను గాడిన పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ ఏం చేస్తోంది?

tesla cars
టెస్లా కార్లు
author img

By

Published : Feb 3, 2022, 6:28 PM IST

Tesla Malfunction: టెస్లా.. వాహన రంగంలో ఓ సంచలనం. అదిరే లుక్స్​, సెల్ఫ్​ డ్రైవింగ్​ వంటి అధునాతన, అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు, ఎస్​యూవీలు తీసుకొచ్చి.. నెక్స్ట్​ జనరేషన్​ వెహికిల్​గా గుర్తింపు పొందింది. అయితే.. ఇప్పుడీ సంస్థను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. సెల్ఫ్​ డ్రైవింగ్ టెక్నాలజీలో లోపాలు సవాళ్లు విసురుతున్నాయి. కార్ల యజమానులు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. అనేక మంది ప్రాణాలను రిస్క్​లో పడేస్తున్నాయి.

సడెన్ బ్రేక్​లతో ప్రయాణికులకు షాక్​లు

సెల్ఫ్​ డ్రైవింగ్.. టెస్లా కార్లలోని ప్రత్యేక ఫీచర్. ఇది ఉంటే మనం డ్రైవింగ్ చేయనవసరం లేదు. ప్రశాంతంగా కూర్చుంటే.. కెమెరాలు, సెన్సార్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​, ప్రీలోడెడ్ మ్యాప్స్​ సాయంతో కారే మనల్ని కావాల్సిన చోటుకు తీసుకెళ్తుంది. అయితే.. డ్రైవర్​ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు వాహనాన్ని నియంత్రించాలని చెబుతోంది టెస్లా.

ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్​ను అమెరికాలో ఎక్కువ మందే ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇటీవల దీనిపై ఫిర్యాదులు ఎక్కువైపోయాయి. అమెరికా ప్రభుత్వ విభాగమైన జాతీయ రహదారి భద్రతా సంస్థ (ఎన్​హెచ్​టీఎస్​ఏ)కు అనేక మంది టెస్లా యజమానులు ఆన్​లైన్​ ద్వారా కంప్లైంట్ చేస్తున్నారు. అందరి సమస్య ఒక్కటే ఫాంటమ్ బ్రేకింగ్.

Tesla Malfunction
వివిధ మోడళ్ల టెస్లా కార్లు

ఫాంటమ్ బ్రేకింగ్​ అంటే... అనవసరంగా కారు సడెన్ బ్రేక్​ వేయడం. ఇది టెస్లా కార్లలో కొత్తేమీ కాదు. అంతకుముందు దాదాపు రెండేళ్లలో ఎన్​హెచ్​టీఎస్​ఏకు ఇదే విషయంపై 34 ఫిర్యాదులు వచ్చాయి. కానీ.. గత 3 నెలల్లో లెక్క మారింది. ఏకంగా 107 కంప్లైంట్​లు అందాయి. "ఆటో పైలట్​ మోడ్​లో ఉండగా కారు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తోంది. ఒక్కోసారి హైస్పీడ్ హైవేలపై ఇలా జరుగుతోంది. వెనుక నుంచి ఏదైనా కారు ఢీకొడుతుందేమోనన్న భయంతో నా పాదాన్ని యాక్సలరేటర్​పైనే ఉంచాల్సి వస్తోంది." అని ఓ వ్యక్తి ఎన్​హెచ్​టీఎస్​ఏకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అవతలివైపు లైనులో వెళ్లే వాహనాలు హెడ్ లైట్లు, నీడల కారణంగా టెస్లా కార్లు ఇలా సడెన్ బ్రేక్​లు వేస్తున్నట్లు ఆ ఫిర్యాదుల విశ్లేషణ ద్వారా తెలిసింది. అనేక అడుగుల దూరంలో ఒక ప్లాస్టిక్ సంచి కనిపించినా తన కారు బ్రేక్ వేసిందని ఓ వ్యక్తి వెల్లడించాడు.

టెస్లా కార్లలోని ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్​ (ఏఈబీ) ఫీచర్​లో లోపాలే ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకుంటే.. కారు సడెన్ బ్రేక్ వేసేలా చేస్తుంది ఏఈబీ. ఇందుకోసం వాహనం చుట్టూ ఉండే సెన్సార్లపై ఆధారపడుతుంది. అయితే.. ఇటీవల రాడార్ సెన్సార్లు తీసేసి.. అనేక కెమెరాలు ఏర్పాటు చేసి ఆటో పైలట్​ మోడ్​ను మార్చింది టెస్లా. అప్పటినుంచే ఈ సడెన్ బ్రేక్​ల సమస్య ఎక్కువైంది.

Tesla Malfunction
టెస్లా ఇంటీరియర్

రెడ్​ సిగ్నల్​ పడినా డోంట్ కేర్..

ఖాళీగా ఉన్న రోడ్లపై సడెన్ బ్రేక్​లు వేయడం ఓ లోపం అయితే.. ట్రాఫిక్​ కూడళ్లలో రెడ్ సిగ్నల్ పడినా ఆగకపోవడం టెస్లా కార్లలోని మరో సమస్య. 'ఫుల్ సెల్ఫ్​ డ్రైవింగ్' ఫీచర్​ను పరీక్షిస్తున్న బీటా యూజర్లు ఈ సమస్యను గుర్తించారు. స్టాప్ సిగ్నల్ ఉన్నా, రెడ్ లైట్​ పడినా.. టెస్లా కార్లు, ఎస్​యూవీలు ఆగకుండా గంటకు 5.6 మైళ్ల వేగంతో ముందుకు వెళ్లిపోతున్నాయని తెలిసింది. దీనంతటికీ రోలింగ్ స్టాప్ ఫీచరే కారణం.

ఈ సమస్య వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగకపోయినా.. ఎన్​హెచ్​టీఎస్​ఏ దీనిని తీవ్రంగా పరిగణించింది. టెస్లా ప్రతినిధులతో రెండుసార్లు విస్తృత చర్చలు జరిపింది. చివరకు 54వేల కార్లు, ఎస్​యూవీలను వెనక్కు పిలిపించి, రోలింగ్ స్టాప్​ ఫీచర్​ను డిసేబుల్ చేసేందుకు టెస్లా అంగీకరించింది.

సెల్ఫ్​ డ్రైవింగ్ టెక్నాలజీ విషయంలో టెస్లా అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. ఆటో పైలట్ మోడ్​లో ఉండగా జరిగిన 12 వేర్వేరు ప్రమాదాలపై అమెరికా జాతీయ రహదారి భద్రతా సంస్థ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి : Indigenous Robot : పంద్రాగస్టు నాటికి స్వదేశీ రోబో రాబోతోంది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.