ETV Bharat / science-and-technology

Joker: మాల్‌వేర్ మళ్లీ వస్తోంది.. జాగ్రత్త! - జోకర్‌ మాల్‌వేర్‌ న్యూస్ లేటెస్ట్

గత కొంత కాలంగా ప్లేస్టోర్‌లోని యాప్‌లపై ఓ మాల్‌వేర్‌ దాడి చేస్తోంది. సాంకేతిక నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్న ఈ మాల్‌వేర్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. యూజర్స్ అలాంటి యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని తెలిపారు.

Joker
జోకర్
author img

By

Published : Jul 17, 2021, 4:08 PM IST

గత కొంత కాలంగా జోకర్‌ మాల్‌వేర్‌తో హ్యాకర్లు ప్లేస్టోర్‌లోని యాప్‌లపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లేస్టోర్.. తరచుగా మాల్‌వేర్‌ ఉన్న యాప్‌లను డిలీట్‌ చేస్తోంది. యూజర్స్ కూడా అలాంటి యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని సూచిస్తోంది. అయితే హ్యాకర్ల నుంచి రక్షణ కల్పించడంలో భాగంగా యాప్‌ డెవలపర్స్ ఎప్పటికప్పుడు తమ యాప్‌లను అప్‌డేట్ చేస్తుంటారు. ఇప్పుడు హ్యాకర్లు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న జోకర్ మాల్‌వేర్‌ను అప్‌డేట్ చేసి కొత్త వెర్షన్‌తో ప్లేస్టోర్‌లోని యాప్‌లపై దాడి చేస్తున్నట్లు గుర్తించామని సైబర్‌ రీసెర్చ్‌ నిపుణులు తెలిపారు. దీంతో గత నాలుగేళ్ల కాలంలో జోకర్ మాల్‌వేర్‌ ఉన్న 1,800కి పైగా ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు జిమ్‌పెరియమ్‌ అనే సైబర్ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది.

ఈ మాల్‌వేర్ ఎక్కువగా కెమెరా యాప్స్‌, గేమింగ్ యాప్స్, మెసేంజర్ యాప్స్, ఫొటో ఎడిటింగ్ యాప్స్, ట్రాన్స్‌లేషన్ యాప్స్‌, వాల్‌పేపర్ యాప్స్‌పై దాడి చేస్తున్నట్లు తెలిపారు. అప్‌డేటెడ్ మాల్‌వేర్‌ను ప్లేస్టోర్‌లోని యాప్‌లోకి ప్రవేశపెట్టిన వెంటనే అది యాప్‌ కోడ్‌ని స్కాన్ చేస్తుంది. అందులో సదరు యాప్‌ లేటెస్ట్ వెర్షన్‌కి సంబంధించిన సమాచారం ఉంటే మాల్‌వేర్ మొబైల్‌ డివైజ్‌ నుంచి యూజర్ వివరాలను సేకరిస్తుందని తెలిపారు. ఒకవేళ లేటెస్ట్ వెర్షన్‌ కోడ్ లేకుంటే మాల్‌వేర్‌ స్తబ్ధుగా ఉంటుందని వెల్లడించారు.

అందుకే ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలానే యూజర్స్ తమ డివైజ్‌లలో ఎప్పటికప్పుడు వైరస్‌ స్కాన్ రన్ చేయాలని సూచించారు. గూగుల్‌, యాపిల్ సంస్థలు కూడా యాప్‌లకు రివ్యూ ఇచ్చే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. దానివల్ల ఎలాంటి యాప్‌ను ఎంచుకుంటున్నామనేది యూజర్‌కి తెలుస్తుందని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.